మెున్న వెనిజులా.. ఇవాళ ఇరాన్. ఈ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు సృష్టించింది. దీంతో రాజకీయ, భౌగోళిక, ఆర్థిక అస్థిరతలతో ఇన్వెస్టర్లు అలర్ట్ అయ్యారు. దీంతో బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై ఎక్కువగా డబ్బు కుమ్మరిస్తున్నారు. దీంతో రిటైల్ మార్కెట్లలో కూడా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. షాపింగ్ చేసే ముందుగా మారిన రేట్లను గమనించండి తెలుగు రాష్ట్రాల ప్రజలు.
తెలుగు రాష్ట్రాల్లో జనవరి 13న బంగారం రేట్లు పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో జనవరి 12 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.38 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 253గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 065గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
ALSO READ : హెచ్‌సీఎల్ టెక్ ప్రాఫిట్ 11 శాతం డౌన్
ఇక వెండి విషయానికి వస్తే భారీ ర్యాలీ అదే దూకుడుతో కొనసాగుతోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగటంతో సిల్వర్ ర్యాలీకి అడ్డుకట్ట లేకుండా కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. అయితే మంగళవారం జనవరి 13, 2025న వెండి రేటు కేజీకి రూ.5వేలు పెరిగి కొనుగోలుదారులను షాక్ కి గురిచేస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 92వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.292 వద్ద ఉంది.
