గోల్డెన్‌ హిస్టరీ..చెస్‌‌ ఒలింపియాడ్‌‌లోఇండియాకు గోల్డ్

గోల్డెన్‌ హిస్టరీ..చెస్‌‌ ఒలింపియాడ్‌‌లోఇండియాకు గోల్డ్

పదుల సంఖ్యలో గ్రాండ్​ మాస్టర్లు ఉన్నారు.  గడికో గ్రాండ్ ​మాస్టర్​ చొప్పున  చదరంగంలోని 64 గడులూ నిండి పోయాయి. విశ్వనాథన్​ ఆనంద్, కోనేరు హంపి వంటి లెజెండరీ ప్లేయర్లు ఆటకే వన్నె తెచ్చారు. వరల్డ్​ చాంపియన్​షిప్స్, నంబర్​ వన్‌ ర్యాంక్​లు, మరెన్నో మేటి ట్రోఫీలు, టైటిళ్లు వచ్చాయి.  ఒక్క  చెస్​ ఒలింపియాడ్​ గోల్డ్​ తప్ప. 

ఇప్పుడు ఆ లోటు కూడా తీరింది. దాదాపు వందేళ్ల ఘన చరిత్ర ఉన్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇండియా బంగారు కల తీరింది. ఫైనల్ చేరిన తొలి సారే మన జట్టు గోల్డ్​తో తిరిగొచ్చింది.  ఇంటర్నెట్​ ఫెయిల్యూర్​, సర్వర్​ ప్రాబ్లమ్స్ తో ఆదివారం వివాదాస్పద రీతిలో జరిగిన టైటిల్​ ఫైట్​లో రష్యాతో కలిసి ఇండియా జాయింట్​ విన్నర్​గా నిలిచింది.  తొలుత రష్యానే విజేతగా తేల్చారు. కానీ, సెకండ్​ రౌండ్​లో నిహాల్​సరిన్, దివ్యా దేశ్‌‌ ముఖ్​ సర్వర్ ప్రాబ్లమ్​ కారణంగా ఓడిపోవడంతో ఈ రిజల్ట్​ను ఇండియా సవాల్​ చేసింది. 40 నిమిషాల  ఉత్కంఠ తర్వాత ఫిడే రెండు జట్లను విజేతలుగా తేల్చడంతో కథ సుఖాంతమైంది. ఇండియా టీమ్​లో ముగ్గురు తెలుగు ప్లేయర్లు ఉండడం విశేషం.

హైదరాబాద్‌‌, వెలుగుచెస్​ ఒలింపియాడ్​లో ఇండియా టీమ్​ హిస్టరీ క్రియేట్​ చేసింది.  కరోనా నేపథ్యంలో తొలిసారి ఆన్​లైన్​లో జరిగిన మెగా ఈవెంట్​లో రష్యాతో కలిసి జాయింట్​ విన్నర్​గా నిలిచింది.  తెలుగమ్మాయి కోనేరు హంపి అసమాన పోరాట పటిమతో  తుదిపోరుకు దూసుకెళ్లిన ఏడో సీడ్‌‌ ఇండియా ఆదివారం వివాదాస్పద రీతిలో సాగిన ఫైనల్లో టాప్‌‌ సీడ్‌‌ రష్యాతో హోరాహోరీగా తలపడింది. ఫస్ట్​ రౌండ్​ను​3–3తో డ్రా చేసుకుంది. కెప్టెన్​ విదిత్, హంపి, పెంటేల హరికృష్ణ,  ద్రోణవల్లి హారిక,  ప్రజ్ఞానంద, దివ్య దేశ్​ముఖ్​ తమ గేమ్స్​ను డ్రా చేసుకున్నారు. ఇక సెకండ్​ రౌండ్​లోనూ తొలి మూడు గేమ్స్​లో ఫలితం రాలేదు.  హరికృష్ణ ప్లేస్​లో వచ్చిన ఆనంద్​.. ఇయాన్ నెపొమ్నియాచితో, డానిల్​ డుబోవ్‌‌తో విదిత్​, అలెగ్జాండ్రా కొస్తెనియుక్‌‌తో హారిక పాయింట్​ పంచుకోవడంతో టెన్షన్​ పెరిగింది. ఈ టైమ్​లో  హంపిని అలెగ్జాండ్రా గొర్యచ్కినా ఓడించింది.  హంపి కూడా కాసేపు సర్వర్‌‌‌‌ ప్రాబ్లమ్‌‌ ఎదుర్కొంది.

ఈ లోపు ఆండ్రే ఎసిపెంకో చేతిలో సరిన్​, పొలినా షువలోవా చేతిలో దేశ్​ముఖ్‌‌ ఓడిపోవడంతో అంతా షాకయ్యారు. ఈ రెండు గేమ్​లు మధ్యలో ఉండగా  టోర్నీ నిర్వహిస్తున్న చెస్‌‌ డాట్‌‌ కామ్‌‌లో సర్వర్​ ప్రాబ్లమ్​ వచ్చింది. ఇంటర్నెట్‌‌ మొరాయించడంతో  ఇండియా ప్లేయర్లు టైమ్​ కోల్పోయి  గేమ్​ పూర్తి చేయలేక ఓడిపోయారు. తన గేమ్‌ను సరిన్‌‌ డ్రా చేసుకునే వాడు. మరోవైపు పొలినాపై దివ్య కచ్చితంగా గెలిచే సిచ్యువేషన్​లో నిలిచింది. కానీ, 4.5–1.5తో ఈ రౌండ్​ గెలిచిన రష్యాను విన్నర్​గా ప్రకటించడం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయాన్ని ఇండియా అఫీషియల్‌‌గా సవాల్‌‌ చేసింది. నిహాల్‌‌, దివ్య సర్వర్‌‌‌‌ ప్రాబ్లమ్స్‌‌ ఎదుర్కొన్నారని ఫిడే దృష్టికి తెచ్చింది. దాంతో,  ఫిడే ప్రెసిడెంట్ అర్కడీ వొర్కొవిచ్‌‌ రెండు జట్లకు గోల్డ్‌‌ షేర్‌‌‌‌ చేయాలని నిర్ణయించారు. ఆ వెంటనే ‘మేం చాంపియన్స్ అయ్యాం​. కంగ్రాంట్స్‌‌ రష్యా’ అని ఆనంద్‌‌ ట్వీట్‌‌ చేశాడు.  ఈ టోర్నీలో ఇండియాకు ఇది సెకండ్​ మెడల్‌‌. 2014లో వచ్చిన బ్రాంజ్‌‌ మెడలే ఇప్పటిదాకా అత్యుత్తమం. కాగా, ఇండియా టీమ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ, స్పోర్ట్స్‌ మినిస్టర్‌‌ కిరణ్‌ రిజిజు సహా పలువురు అభినందించారు. మన ప్లేయర్ల కృషి, పట్టుదల అభినందనీయమని మోడీ ట్వీట్‌ చేశారు.