ఆల్ టైం రికార్డ్ ధరకు బంగారం ధర.. ఒక్కరోజే రూ.2 వేల200 పెరిగింది

ఆల్ టైం రికార్డ్ ధరకు బంగారం ధర.. ఒక్కరోజే రూ.2 వేల200 పెరిగింది

న్యూఢిల్లీ: బలమైన అంతర్జాతీయ సంకేతాల వల్ల సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.2,200 పెరిగి రూ.1,16,200 రికార్డు గరిష్ట స్థాయికి చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ.1,14,000 వద్ద ముగిసింది. స్థానిక మార్కెట్‌‎లో, 99.5 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ.2,150 పెరిగి రికార్డు గరిష్ట స్థాయి రేటు రూ.1,15,650 కి చేరింది. 

హెచ్‌‎డీఎఫ్‌‌‎సీ సెక్యూరిటీస్‌‌‎కు చెందిన సౌమిల్ గాంధీ మాట్లాడుతూ, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాలు డాలర్, ట్రెజరీ యీల్డ్స్‌‌‌‌పై ప్రభావం చూపాయని, దీనివల్ల విలువైన లోహాల ధరలు పెరిగాయని చెప్పారు. ఈ ఏడాదిలో బంగారం ధర  రూ.37,250  (47.18 శాతం) పెరిగిందని అసోసియేషన్​ తెలిపింది.