దేశంలో రూ.500 పెరిగిన బంగారం ధర

దేశంలో రూ.500 పెరిగిన బంగారం ధర
  • వెండి రేటు రూ.400 జంప్​

న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్‌‌‌‌ ర్యాలీ నేపథ్యంలో గురువారం దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.72,350కి చేరుకుందని హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ సెక్యూరిటీస్ తెలిపింది.  క్రితం సెషన్‌‌‌‌లో 10 గ్రాముల ధర రూ.71,850 వద్ద ముగిసింది. 

వెండి ధర కూడా కిలో రూ.400 పెరిగి రూ.83,500కి చేరింది. క్రితం ట్రేడింగ్‌‌‌‌లో కిలో రూ.83,100 వద్ద ముగిసింది. మే డే సందర్భంగా మే 1న కమోడిటీ మార్కెట్లు పాక్షికంగా మూతపడ్డాయి. విదేశీ మార్కెట్ల నుంచి బుల్లిష్ ట్రెండ్స్​కారణంగా ధరలు పెరిగాయి. హైదరాబాద్​లో బంగారం ధర రూ.72,770లకు చేరింది. వెండిధర రూ.87,000 ఉంది.