
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త.. కొత్త సంవత్సరంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు.. జనవరి 3వ తేదీ బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న హెచ్చుతగ్గుల ప్రభావంతో భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 తగ్గించారు. కిలో వెండిపై రూ.300 తగ్గింది. దీంతో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఎన్నాయో చూద్దాం.
హైదరాబాద్, విజయవాడ:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,500 గా ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,820 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.80,000గా ఉంది.
దేశంలో బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,650 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,970 గా ఉంది. కిలో వెండి ధర రూ.78,600.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,500 గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,820 గా ఉంది. కిలో వెండి ధర రూ.78,600.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,500 గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,820 గా ఉంది. కిలో వెండి ధర రూ.76,500.
చెన్నైలో బంగారం ధరలు స్వల్పంగా రూ.50 మాత్రమే తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,150గా , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,530గా ఉంది. కిలో వెండిపై రూ.300 తగ్గి.. రూ.80,000గా ఉంది.