అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్..బంగారం ధర రూ.4 వేలు జంప్

అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్..బంగారం  ధర రూ.4 వేలు జంప్
  • 10 గ్రాముల ధర రూ.1.37 లక్షలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్​బాగుండటంతో సోమవారం ఢిల్లీలో బంగారం ధర రూ.నాలుగు వేలు పెరిగింది. పది గ్రాముల ధర రూ.1.37, 600 వద్ద హిస్టారికల్ హైని టచ్ చేసింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం... శుక్రవారం ధర రూ.1,33,600 వద్ద ముగిసింది. 

]యూఎస్​ ఆర్థిక గణాంకాల అంచనాలు, సురక్షిత పెట్టుబడి డిమాండ్​తో బంగారం ధరలు పెరిగాయి. ఈ ఏడాదిలో బంగారం ధర రూ.58,650 (74.3 శాతం) పెరిగింది. వెండి ధరలు కిలోకు రూ.1,99,500 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఈ ఏడాదిలో దీని 122.41 శాతం పెరిగింది.