
- వెండి ధర రూ. 1,400 అప్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ర్యాలీ కారణంగా శుక్రవారం దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర రూ.800 పెరిగి రూ.73,350కి చేరింది. క్రితం సెషన్‌లో 10 గ్రాముల ధర రూ.72,550 వద్ద ముగిసింది. వరుసగా నాలుగో రోజు లాభాలు కొనసాగడంతో వెండి ధరలు కూడా కిలోకు రూ.1,400 పెరిగి రూ.93,700కి చేరుకున్నాయి. గురువారం కిలో రూ.92,300 వద్ద ముగిసిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లోని రీసెర్చ్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
గ్లోబల్ మార్కెట్లలో కమోడిటీ ఎక్స్చేంజ్ వద్ద స్పాట్ బంగారం ఔన్సుకు (దాదాపు 28 గ్రాములు) 2,360 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే 28 డాలర్లు పెరిగింది. శుక్రవారం కూడా బంగారం ధర పెరిగింది. వెండి కూడా ఔన్సుకు 30.40 డాలర్లు పెరిగింది. ఇది గురువారం ఔన్స్‌కు 30.15 డాలర్ల వద్ద స్థిరపడింది. హైదరాబాద్‌లో శుక్రవారం పది గ్రాముల బంగారం ధర రూ.74,545, వెండి ధర రూ.98,500 పలికింది.