పుంజుకున్న బంగారం ధరలు.. రూ. 2వేల600 పెరిగిన బంగారం..వెండి ధర రూ. 6వేల700 జంప్

పుంజుకున్న బంగారం ధరలు.. రూ. 2వేల600 పెరిగిన బంగారం..వెండి ధర రూ. 6వేల700 జంప్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయానికి ముందు సురక్షిత పెట్టుబడులవైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం వల్ల బుధవారం బంగారం ధరలు భారీగా పుంజుకున్నాయి. రెండు రోజుల క్షీణతకు తెరదించుతూ, జాతీయ రాజధానిలో 10 గ్రాముల పసిడి ధర రూ. 2,600 పెరిగి రూ. 1,24,400కు చేరుకుంది. 

ఆలిండియా సరాఫా అసోసియేషన్​ ప్రకారం, 99.5 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర అన్ని పన్నులతో కలిపి రూ. 1,21,200 నుంచి రూ. 1,23,800కు పెరిగింది.  వెండి ధర కూడా వేగంగా పుంజుకుంది. కిలో వెండి ధర రూ. 6,700 పెరిగి రూ. 1,51,700కు చేరింది. మిడిల్​ఈస్ట్​లో భౌగోళిక, రాజకీయ ఆందోళనల కారణంగా సురక్షిత ఆస్తులకు డిమాండ్ పుంజుకోవడం ధరలు పెరగడానికి కారణమని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ సెక్యూరిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సౌమిల్ గాంధీ తెలిపారు.

 అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి ధర మూడు రోజుల నష్టాలకు ముగింపు పలుకుతూ, 1.95 శాతం పెరిగి ఔన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 4,029.53 డాలర్ల వద్ద ట్రేడయింది.  యూఎస్–చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతున్న సంకేతాలు, యూఎస్ సెనేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వ కార్యకలాపాలను నిలిపివేసే బిల్లు ఆమోదం పొందకపోవడం, యూఎస్, రష్యా మధ్య వివాదాలు కొనసాగడంతో విలువైన లోహాల ధరలు పెరుగుతున్నాయని  ఎనలిస్టులు చెబుతున్నారు.