చల్లబడ్డ బంగారం, వెండి.. వరుసగా రెండో రోజు తగ్గిన ధరలు.. ఇవాళ(23 oct) తులం ఎంతంటే ?

చల్లబడ్డ బంగారం, వెండి.. వరుసగా రెండో రోజు తగ్గిన ధరలు.. ఇవాళ(23 oct) తులం ఎంతంటే ?

బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. దీపావళి తరువాత  వరుసగా రెండో రోజు  కూడా ఇవాళ (23 oct)  బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత కొద్దిరోజులుగా ఆకాశానికి పరుగులు పెట్టిన ధరలు ఇప్పుడు రోజోరోజుకు పడిపోతున్నాయి. ఇందుకు కారణం అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోవడం కొనసాగించారు. మన దేశంలో  బంగారం ధర ఇప్పటివరకు అతిపెద్ద తగ్గుదలను చూసింది, అలాగే పండుగ సీజన్లో పెట్టుబడిదారులకు కొనేందుకు అవకాశం కల్పించింది.

గత పది నెలలుగా, ముఖ్యంగా గత రెండు నెలల్లో దేశంలో బంగారం ధర భారీగా పెరిగింది. ప్రపంచ దేశాల వాణిజ్యం పై పెరుగుతున్న ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సుంకాల అస్థిరత బంగారం ధరల నిరంతర ర్యాలీకి ఆజ్యం పోశాయి.

ఇవాళ(23 oct)  24 క్యారెట్ల బంగారం  1గ్రామ ధర రూ.81 తగ్గి రూ.12,508 తగ్గగా, 22 క్యారెట్ల ధర రూ. 75 తగ్గి రూ.11,465, 18 క్యారెట్ల ధర రూ.61 పడిపోయి రూ. 9,381. 

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,25,080తో రూ.810 తగ్గింది. 22 క్యారెట్ల  ధర  రూ.750 తగ్గి రూ.1,14,650 , 18 క్యారెట్ల ధర రూ.610 తగ్గి రూ.93,810. 

ALSO READ : డబ్బులు వెనక్కి.. డెట్ఫండ్స్కు తగ్గిన ఆదరణ..

ఇక హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,25,080, 22 క్యారెట్ల ధర  రూ.1,14,650, 18 క్యారెట్ల ధర రూ.93,810. 

విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,25,080, 22 క్యారెట్ల ధర రూ.1,14,650, 18 క్యారెట్ల ధర రూ.93,810.  

ఇక వెండి  ధర కూడా ఇవాళ తగ్గింది. ప్రస్తుతం 1 లక్ష 59 వేలు ఉన్న వెండి కేజీ ధర ఇవాళ  వెయ్యి తగ్గింది. దింతో వెండి గ్రాము ధర రూ.1 తగ్గి రూ.159 ఉండగా,  కేజీ ధర రూ.1 లక్ష 59 వేలుగా ఉంది.