ఇరాన్ యుద్ధం గురించి పూటకో విధంగా అటు అమెరికా నుంచి ఇటు ఇరాన్ రెవల్యూషినరీ గార్డ్స్ నుంచి వస్తున్న ప్రకటనలు బులియన్ మార్కెట్లను కూడా గందరగోళానికి గురిచేస్తున్నాయి. యుద్ధ చర్చలు జరుగుతున్నాయా లేదా అనే అనుమానాలు ఇన్వెస్టర్లను వెంటాడుతుండటంతో మార్కెట్లు అస్తవ్యస్థంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీరామ నవమి రోజున బంగారం రేట్లు పెరిగాయి. షాపింగ్ చేయాలనుకుంటున్న వారు తాజా రేట్లను పరిశీలించటం ముఖ్యం.
మార్చి 27న బంగారం రేట్లు స్వల్పంగా పెరిగింది. మార్చి 26 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.16 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 471గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 265గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మార్చి 27, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.10వేలు తగ్గింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 45వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.245 వద్ద ఉంది.
