భువనగిరి జిల్లా ఆసుపత్రిలో డెడ్ బాడీపై బంగారం మాయం

భువనగిరి జిల్లా ఆసుపత్రిలో డెడ్ బాడీపై బంగారం మాయం

యాదాద్రి భువనగిరి జిల్లా:  భువనగిరి ఏరియా హాస్పిటల్ లో ఘోరాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. రోగుల ప్రాణాలు కాపాడటం పక్కన పెడితే .. చనిపోయాక డెడ్ బాడీపై బంగారం కూడా దోచుకుంటున్నారు. ఈ సంఘటన సోమవారం భువనగిరి జిల్లా ఆసుపత్రిలో  జరిగింది. గుండెపోటుతో చనిపోయిన మహిళ మెడలోంచి రెండు పుస్తెలు,రెండు బంగారు గుండ్లు సిబ్బంది మాయం చేశారని ఆరోపించారు మృతురాలి కుటుంబ సభ్యులు. 

భువనగిరిలోని, అర్బన్ కాలనీ చెందిన లలిత అనే మహిళకు సోమవారం గుండెపోటు రావడంతో వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను పరీక్షించి ఆమెతో ఎవరైనా వచ్చారా అని అరా తీశారు. లలిత అత్త ఒక్కతే ఉందని గమనించిన సిబ్బంది లలిత చావు  కబురును మెల్లగా చెప్పారట.  ఆమె డెడ్ బాడీని అత్తకు అప్పగిస్తూ ఆసుపత్రికి వచ్చే సమయంలో ఆమె మెడలో ఉన్న రెండు పుస్తెలు ,రెండుగుండ్ల తీసేశారట. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీయడంతో.. లలిత హాస్పిటల్ కి వచ్చే ముందు ఆమె మెడలో అసలు బంగారమే లేదని దబాయించారట. దీంతో హాస్పిటల్ ముందు  లలిత బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. భువనగిరి జిల్లా ఆసుపత్రిలో ఇన్ని దారుణ సంఘటనలు జరుగుతున్నా అధికారుల్లో మాత్రం చలనం రావడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అసలే 8 మ్యాచ్ లు ఓడిపోయామన్న బాధతో ఉంటే.. కృనాల్ ఓవరాక్షన్..!

ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్