3 వేల 40 రూపాయలు పెరిగిన బంగారం ధర.. తులం రేటు లక్షా 33 వేలు దాటింది !

3 వేల 40 రూపాయలు పెరిగిన బంగారం ధర.. తులం రేటు లక్షా 33 వేలు దాటింది !

న్యూఢిల్లీ: బలమైన అంతర్జాతీయ ట్రెండ్స్,  డాలర్ పతనం కారణంగా జాతీయ రాజధానిలో పది గ్రాముల బంగారం ధర రూ.3,040 పెరిగి రూ.1,33,200కు చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది.  వెండి వరుసగా ఐదో రోజూ పెరిగింది. కిలో ధర రూ.5,800 పెరిగి రూ.1.77 లక్షలకు చేరింది. 

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ధర ఒక శాతం పెరిగి ఔన్స్‌‌‌‌కు  4,261.52 డాలర్లకు ఎగిసింది. డాలర్ ఇండెక్స్ 0.19 శాతం తగ్గి 99.27 వద్ద ఉంది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు పసిడి ధర 63.6 శాతం పెరిగింది.  వెండి ధర కేవలం 11 నెలల్లో రెట్టింపయిందని అసోసియేషన్​ తెలిపింది.