సినిమా రంగంలో అడుగు పెట్టాలన్న కోరిక ఉన్న యువ రైటర్లకు అద్భుత అవకాశం. సూపర్ ఐడియాలు ఉండి డెవలప్ చేయగలిగినా.. ఫీల్డ్‌లోకి వెళ్లే విషయంలో ఇబ్బందులు పడుతున్న వారికి మంచి గాడిన పడే చాన్స్ ఇది. అవగాహనతో సరైన దారిలో దూసుకెళ్లాలనుకునే వారి కోసం ‘స్క్రిప్ట్ బాక్స్’ టీమ్ వర్క్ షాప్ నిర్వహిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్, గురు ఫిల్మ్స్, V6 చిల్ ఈ వర్క్ షాప్‌ను స్పాన్సర్ చేస్తున్నాయి.
‘ద బ్లాంక్ పేజ్’ అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాప్‌కు యువ డైరెక్టర్లు, స్క్రిప్ట్ రైటర్లు, స్క్రీన్ రైటర్లకు ఆహ్వానం పలుకుతోంది స్క్రిప్ట్ బాక్స్. తమ టాలెంట్‌ను మరింత షైన్ చేసుకోవడంతో పాటు తమ లాంటి మరింత మందిని ఒకే వేదికపై కలుసుకునే వీలు కల్పిస్తోంది. ఓటీటీ, వెబ్ సిరీస్, సినీ రంగాల్లో రాణించేందుకు అనుభవజ్ఞులతో సలహాలు, సూచనలు అందించబోతోంది. మూడు రోజుల పాటు నిపుణుల సలహాలను అందించడంతో పాటు వారి ఐడియాలను ఎలా ఒక సరైన ట్రాక్‌లో పెట్టి ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలన్న దానిపై అవగాహన కల్పించబోతోంది. మంచి సత్తా ఉన్న రైటర్లకు ఇంటర్న్‌షిప్‌ను ఆఫర్ చేసి.. వారి ఐడియాలను తెరకెక్కించేందుకు దన్నుగా కూడా నిలుస్తుంది.
బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఇన్‌స్టిట్యూట్ ‘యాక్టర్ ప్రిపేర్స్’లో స్క్రీన్ రైటింగ్ ప్రోగ్రామ్ డిజైనర్, కోచ్ సత్యాన్షు సింగ్ ఈ వర్క్ షాప్‌కు మెంటర్‌గా వస్తున్నారు. ఆయన 2013లో తమాష్ అనే షార్ట్ ఫిల్మ్‌తో నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. ఆర్మీలో మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ఆయన సినిమా ఇండస్ట్రీపై ప్యాషన్‌తో తన జాబ్ వదిలేసి ఈ రంగంలో అడుగుపెట్టారు. 2019లో చింటూ కా బర్త్‌డే అనే సినిమా కథ, కోడైరక్టర్‌గా పని చేశారు.
వర్క్‌షాప్ వివరాలు
- డేట్స్: జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు,
- టైమింగ్స్: ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6.30 వరకు
- స్థలం: రామానాయుడు ఫిల్మ్ స్కూల్, రోడ్ నంబర్ 92, జూబ్లీహిల్స్, ఎమ్మెల్యే కాలనీ, హైదరాబాద్.
- పూర్తి వివరాల కోసం: 95730 67671
రిజిస్ట్రేషన్ కోసం: https://www.meraevents.com/event/the-blank-page-screenwriting-scriptwriting-workshop
