‘గోల్డెన్​ గ్లోబ్​’ రేసులో ఆర్​ఆర్​ఆర్​.. 2 కేటగిరీల్లో నామినేషన్​

‘గోల్డెన్​ గ్లోబ్​’ రేసులో ఆర్​ఆర్​ఆర్​.. 2 కేటగిరీల్లో నామినేషన్​

ప్రఖ్యాత దర్శకుడు ఎస్​.ఎస్​.రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్​ఆర్ఆర్​’ మూవీ మరో ఘనతను సొంతం చేసుకుంది.  ఖ్యాతి గడించిన ‘గోల్డెన్​ గ్లోబ్​ అవార్డ్స్​’ కోసం రెండు కేటగిరీల్లో ఈ సినిమా నామినేట్​ అయ్యింది. బెస్ట్​ నాన్​ ఇంగ్లిష్​ ల్యాంగ్వేజ్​ ఫిల్మ్​ విభాగంలో ‘ఆర్​ఆర్​ఆర్​’ ఎంట్రీ సాధించింది. ఇక బెస్ట్​ ఒరిజినల్​ సాంగ్ విభాగంలోనూ ‘ఆర్​ఆర్​ఆర్​’ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ నామినేట్​ అయింది.​ 

‘నాన్​ ఇంగ్లిష్​ ల్యాంగ్వేజ్​ ఫిల్మ్​’ కేటగిరీలో నామినేట్​ అయిన మిగతా నాలుగు సినిమాల జాబితాలో ఆల్​ క్వైట్​ ఆన్​ ది వెస్టెర్న్​ ఫ్రంట్​ (జర్మనీ), అర్జెంటీనా 1985 (అర్జెంటీనా), క్లోజ్​ (బెల్జియం), డెసిషన్​ టు లీవ్​ (సౌత్​ కొరియా) ఉన్నాయి. ఈ నాలుగింటిలో ఒక దానికి ‘నాన్​ ఇంగ్లిష్​ ల్యాంగ్వేజ్​ ఫిల్మ్​’ కేటగిరిలో గోల్డెన్​ గ్లోబ్​ అవార్డును జనవరి 10న ప్రకటించనున్నారు. భారత కాలమానం ప్రకారం జనవరి 11న వేకువ జామున అమెరికాలోని లాస్​ ఏంజెలెస్​ లో గోల్డెన్​ గ్లోబ్​ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ప్రఖ్యాత కమేడియన్​ జెరాడ్​ క్యార్మికేల్​ ఈ కార్యక్రమానికి హోస్ట్​ గా వ్యవహరించనున్నారు. 

భారత స్వాతంత్ర్య విప్లవ యోధులు కొమరం భీం, అల్లూరి సీతారామ రాజుల జీవితాల నేపథ్యంలో ‘ఆర్​ఆర్​ఆర్​’ సినిమాను నిర్మించారు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రను హీరో రాంచరణ్​, కొమరం భీం పాత్రను జూనియర్​ ఎన్టీఆర్​ పోషించారు. ఆలియా భట్​, అజయ్ దేవ్​ గణ్, శ్రియా శరణ్ లతో పాటు బ్రిటీష్ నటులు రే స్టీవెన్సన్​, ఆలిసన్​ డూడీ కూడా ఇందులో కీలక పాత్రల్లో నటించారు.