భద్రాచలం సీతా రామయ్యకు సువర్ణ తులసీదళ అర్చన

 భద్రాచలం సీతా రామయ్యకు సువర్ణ తులసీదళ అర్చన

భద్రాచలం, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామికి శనివారం సువర్ణ తులసీ దళాలతో అర్చన నిర్వహించారు. రామపాదుకలకు భద్రుడి మండపంలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. బేడా మండపంలో కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం జరగ్గా భక్తులు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు. 

ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్, ఉప లోకాయుక్త బీఎస్ జగజీవన్​కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో దామోదర్​రావు ఆధ్వర్యంలో అర్చకులు వారికి స్వాగతం పలికి, పూజల అనంతరం వేదాశీర్వచనంతో పాటు ప్రసాదం, జ్ఞాపికలు అందజేశారు.