భద్రాచలం సీతారామయ్యకు బంగారు పుష్పార్చన

భద్రాచలం సీతారామయ్యకు బంగారు పుష్పార్చన

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామికి ఆదివారం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం ఉదయం గర్భగుడిలో మూలవరులకు ఆవుపాలు, నెయ్యి, పెరుగు, తేనె, పంచదారలతో అభిషేకం చేసి, సమస్త నదీజలాలతో స్నపన తిరుమంజనం జరిపారు. మంజీరాలు అద్ది అభిషేకం చేశాక భక్తులకు అభిషేక జలాలను పంపిణీ చేశారు. అలంకరణ అయ్యాక బంగారు పుష్పాలతో అర్చన చేసి, ప్రత్యేక హారతులు సమర్పించారు. 

కల్యాణమూర్తులను ఊరేగింపుగా బేడా మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం చేశారు. మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ నిర్వహించారు. ఖమ్మం బ్యాంకు కాలనీకి చెందిన పోట్ల వంశీకృష్ణ సీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116ను విరాళంగా అందజేశారు.