కోటీశ్వరుడ్ని చేసిన బంగారు చేపలు

కోటీశ్వరుడ్ని చేసిన బంగారు చేపలు

ముంబై: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడికి జాక్​పాట్​తగిలింది. వలలో పడ్డయి 157 చేపలే అయినా.. వాటి అమ్మకంతో కోటీశ్వరుడయ్యాడు. మహారాష్ట్ర ప్రభుత్వం నెల క్రితం చేపలవేటపై పెట్టిన నిషేధం ఇటీవల ఎత్తేసింది. పాల్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌కు చెందిన చంద్రకాంత్‌‌‌‌‌‌‌‌ అనే మత్స్యకారుడు మరో 8మందితో కలిసి ఆగస్టు 28న హర్బా దేవి అనే బోట్‌‌‌‌‌‌‌‌లో సముద్రంలో చేపలవేటకు వెళ్లాడు. 25 నాటికల్‌‌‌‌‌‌‌‌ మైళ్ల దూరం వెళ్లాక వల విసిరాడు. ‘సముద్రపు బంగారం’గా పిలిచే157 ‘ఘోల్ ఫిష్‌‌‌‌‌‌‌‌’ వలలో పడ్డాయి. ఈ చేపల్లో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. వీటికి హాంకాంగ్, మలేషియా, థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్, ఇండోనేషియా, సింగపూర్, జపాన్​ దేశాల్లో డిమాండ్ ఎక్కువ. ఆ చేపలను పాల్‌‌‌‌‌‌‌‌గఢ్​లోని ముర్బే ప్రాంతంలో వేలం వేయగా రూ.1.33 కోట్లు వచ్చాయి. ఈ చేప సైంటిఫిక్ పేరు ప్రొటోనిబే డియాకంథస్. మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌, కాస్మొటిక్స్‌‌‌‌‌‌‌‌ తయారీతో పాటు ఆపరేషన్స్ చేసినప్పుడు శరీరంలో కరిగిపోయేలా కుట్లు వేసేందుకు వాడే దారం కూడా ఈ చేపల నుంచే ఉత్పత్తి చేస్తారు.  అందుకే వీటిని ఫార్మా కంపెనీలు భారీ రేటుతో కొంటాయి.