
మెహిదీపట్నం, వెలుగు: చారిత్రాత్మక గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి (ఎల్లమ్మ తల్లి) ఆలయంలో గురువారం మూడో పూజ ఘనంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ చంటి బాబు నేతృత్వంలో అభిషేకాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బోనాలు, ముడుపులు సమర్పించి మొక్కులు చెల్లించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో వసంత తెలిపారు. మధ్యాహ్నం బల్దియా డిప్యూటీ కమిషనర్ శశిరేఖ, గోల్కొండ, నాంపల్లి తహసీల్దార్లు అహల్య, జ్యోతి, తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.