గొర్రెలియ్యాలంటూ గొల్ల కురుమల రాస్తారోకో  

గొర్రెలియ్యాలంటూ గొల్ల కురుమల రాస్తారోకో  

పెద్దపల్లి: ‘గొర్రెలైనా ఇవ్వండి, లేదా మా డబ్బులైనా తిరిగి ఇవ్వండి’ అంటూ యాదవ, కురుమ సంఘాలు శనివారం కాల్వ శ్రీరాంపూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో కాల్వ శ్రీరాంపూర్ నుంచి పెద్దపల్లి నుంచి సుల్తానాబాద్  వెళ్లే వాహనాలు దాదాపు గంట పాటూ నిలిచిపోయాయి. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని రాస్తారోకో విరమింపజేశారు. 6 నెలల క్రితం రెండో విడత సబ్సిడీ గొర్రెల కోసం మండలంలోని 24 గ్రామ పంచాయితీల పరిధిలో ఉన్న 835 గొల్ల, కురుమలలో,  299 మంది సభ్యులు గొర్రెలు వస్తాయని ఆశతో డీడీలు తీయడం తీశామని గొల్ల కురుమలు చెప్పారు. ప్రతీ డీడీకి రూ. 43,750  చెల్లించారన్నారు.  ఆరు నెలలు గడిచినా ఇంతవరకు రెండవ విడత గొర్రెలను ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.