అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో పదిరోజులుగా గొల్లపల్లి- చీర్కపల్లి రైతుల ధర్నా

అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో పదిరోజులుగా గొల్లపల్లి- చీర్కపల్లి రైతుల ధర్నా

రేవల్లి/ఏదుల, వెలుగు:  గొల్లపల్లి--చీర్కపల్లి ప్రాజెక్టు ప్రతిపాదనకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసన దీక్ష గురువారం నాటికి అఖిలపక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో 10వ రోజుకు చేరుకుంది.  వనపర్తి ఎమ్మెల్యే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 1372 ఎకరాల సారవంతమైన భూమి నీట మునిగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ​భూ సేకరణ వల్ల వందలాది కుటుంబాలు వీధిన పడే ప్రమాదం ఉందని, తమ జీవితాలు భవిష్యత్తులో అంధకారమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పది రోజులుగా ఎండను సైతం లెక్కచేయకుండా రైతులు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు వెల్లువలా పెరుగుతోంది. గొల్లపల్లి, చీర్కపల్లి గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు  తరలివచ్చి నిరసనలో భాగస్వామ్యమవుతున్నారు. దీంతో ఈ ఉద్యమం మరింత ఉధృత రూపం దాల్చుతోంది. ఈ ధర్నాలో రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.