ఉద్యోగాల పేరుతో కోట్లు దండుకుండ్రు

ఉద్యోగాల పేరుతో కోట్లు దండుకుండ్రు

పెద్దపల్లి జిల్లా: మంత్రి  కొప్పుల ఈశ్వర్ బావ జెన్కో భూమిని కబ్జా చేసి బ్రిక్స్ ఇండస్ట్రీ నడుపుతున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు ఆరోపించారు. రామగుండం ఎన్టీపీసీ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఉద్యోగాల పేరుతో  మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరులు అమాయకుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారని మండిపడ్డారు. దాదాపు 500 మంది నుంచి రూ. 40 కోట్లు దండుకున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయంపై మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.  నష్టపోయిన బాధితులకు వెంటనే డబ్బు తిరిగి చెల్లించాలని కోరారు.

బాధితులకు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే గవర్నర్ ను కలిసి ప్రజా దర్బార్ పెడతామన్న ఆయన... అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్ సిఎల్)  బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని, డబ్బలు తిరిగి ఇవ్వకపోతే ఇందిరా పార్కులో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులందరి డేటా సీఎం కేసీఆర్ దగ్గర వద్ద ఉందన్న ఆయన... ఇప్పటికైనా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ స్పందించాలని కోరారు.