ManaShankaraVaraPrasadGaru: ‘మన శంకర వర ప్రసాద్’ ప్రీమియర్స్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

ManaShankaraVaraPrasadGaru: ‘మన శంకర వర ప్రసాద్’ ప్రీమియర్స్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో సంక్రాంతి బరిలోకి వచ్చారు. అనిల్ రావిపూడి రూపొందించిన మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’(MSG).. ఇవాళ (జనవరి 12న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే, ఆదివారం రాత్రే (జనవరి 11న) ప్రీమియర్స్తో మెగా ఫ్యాన్స్ను పలకరించారు చిరు.

ఈ క్రమంలో సినిమా చూసిన, మెగా ఆడియన్స్ మరియు సగటు సినీ ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ ఎంట్రీ ఇవ్వడంతో.. మెగా-విక్టరీ పండుగన్నట్లుగా థియేటర్ల దగ్గర సందడి మొదలైంది. మరి ఈ సినిమా కథ ఏంటి? అనిల్ మార్క్ కామెడీ వర్కౌట్ అయిందా? గత సంక్రాంతికి వెంకటేష్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్.. ఈ సారి చిరుతో ఎలాంటి హిట్ అందుకున్నాడు? అనేది X (గతంలో ట్విట్టర్) రివ్యూలో తెలుసుకుందాం. 

కథేంటంటే:

శంకర వరప్రసాద్ (మెగాస్టార్ చిరంజీవి) ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. ఆయన టీమ్‌(కేథరీన్‌, హర్ష వర్ధన్‌, అభినవ్‌  గోమఠం). దేశ భద్రతే తన జీవితం అనుకునే వ్యక్తి శంకర వరప్రసాద్. కానీ అదే క్రమంలో, శంకర వరప్రసాద్ తన కుటుంబ జీవితాన్ని పూర్తిగా కోల్పోతాడు. 

అతని భార్య శశిరేఖ (నయనతార)- ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత, అతని వల్ల విసిగిపోయి విడాకులు తీసుకుంటుంది. అలా శశిరేఖ తన తండ్రి, పెద్ద బిజినెస్ టైకూన్ జీవీఆర్ (సచిన్ ఖేడ్కర్) దగ్గరకి వెళ్లిపోతుంది. ఇద్దరు పిల్లలను కూడా వరప్రసాద్‌కు దూరం చేస్తుంది.

ఆరు సంవత్సరాలుగా పిల్లలను చూడలేక, భార్యను కోల్పోయి, మానసికంగా పూర్తిగా ఒంటరిగా మారిపోతారు వరప్రసాద్. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర హోం మంత్రి నితీష్ శర్మ (శరత్ సక్సేనా), తన ప్రభావంతో ఒక ప్లాన్ వేస్తాడు.

వరప్రసాద్‌ను పిల్లలు చదువుతున్న బోర్డింగ్ స్కూల్‌లో పీఈటీ టీచర్‌గా పంపిస్తాడు. తండ్రిపై ద్వేషంతో ఉన్న పిల్లలు అతడిని అసలు గుర్తించరు. కానీ క్రమంగా అతని నిజమైన ప్రేమ, త్యాగం వాళ్ల మనసుల్లో మార్పు తెస్తుంది.

ఇదే సమయంలో కథలోకి ఎంటర్ అవుతాడు వెంకీ గౌడ (విక్టరీ వెంకటేష్) – ఒక మైనింగ్ బిజినెస్ టైకూన్. శశిరేఖతో అతనికి ఉన్న సంబంధం, వారి గతం, దీనివల్ల వరప్రసాద్ కుటుంబంపై వచ్చిన మార్పులు.. ఇవన్నీ కథను కీలక మలుపులవైపు తీసుకెళ్తాయి.

-> అసలు శశిరేఖ – వరప్రసాద్ విడిపోవడానికి గల కారణం ఏంటి? 
-> వెంకీ గౌడ పాత్ర.. పాజిటివ్‌నా లేదా నెగటివ్‌నా?
-> తండ్రిగా వరప్రసాద్ తన పిల్లల మనసులను తిరిగి గెలుచుకున్నాడా? లేదా?
-> చివరికి శశిరేఖ, వరప్రసాద్‌ మళ్లీ కలిశారా లేదా? 
అనే తదితర విషయాలు తెలియాలంటే.. మూవీ థియేటర్లో చూడాల్సిందే.

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సంక్రాంతి ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ను ఇందులో మేళవించడంతో పాటు, చిరు కామెడీ, పాటలు, డ్యాన్స్ అన్నీ అదిరిపోయాయని.. వింటేజ్ చిరుని చూపించారంటూ అనిల్ను కొనియాడుతున్నారు. రెగ్యూలర్ స్టైల్ ఎంటెర్టైన్మెంట్ ఆకట్టుకుంటుందని సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. అయితే, సినిమాలో కొన్ని సాగదీత సీన్స్, ఎప్పటిలాగే రొటీన్ డ్రామా ఉందంటూ సగటు సినీ ప్రేక్షకులు కామెంట్స్ పెడుతున్నారు. చిరు-వెంకీ కాంబోలో వచ్చే సీన్స్ మెగా-విక్టరీ ఫ్యాన్స్ ను విజిల్స్ వేయించేలా ఉందంటున్నారు.    

‘మన శంకర వరప్రసాద్ గారు’కి ఫస్ట్ హాఫ్ విషయంలో సోషల్ మీడియాలో మంచి బజ్ కనిపిస్తోంది.

-> చిరంజీవి ఎంట్రీకి స్పెషల్ విజిల్స్ పడుతున్నాయట. ఎటువంటి బిల్డప్ షాట్లు లేకుండా.. సింపుల్‌గా, కూల్‌గా వచ్చే చిరు లుక్ ఫ్యాన్స్‌కు ఫ్రెష్‌గా అనిపించిందని చెబుతున్నారు. “స్టార్‌గా కాదు.. క్యారెక్టర్‌గా చిరు వచ్చాడు” అని చాలామంది X లో రాస్తున్నారు.

హుక్ స్టెప్ సాంగ్ థియేటర్ హాల్ని ఊపేస్తుందట. ముఖ్యంగా స్టెప్ సింపుల్‌గా ఉండటం వల్ల ఆడియన్స్ కూడా వెంటనే కనెక్ట్ అవుతున్నారట. తర్వాత వచ్చే ఫస్ట్ ఫైట్ మాత్రం “వింటేజ్ మెగాస్టార్ బ్యాక్” అనిపించేలా స్టైలిష్‌గా ఉందని టాక్.

కామెడీనే.. అసలు ప్లస్ పాయింట్:

చిరు – నయనతార మధ్య వచ్చే డొమెస్టిక్ సీన్స్ చాలా న్యాచురల్‌గా, ఎమోషన్ + నవ్వు మిక్స్‌తో వర్క్ అయ్యాయట. అలాగే చిరంజీవి – బుల్లిరాజు (చైల్డ్ ఆర్టిస్ట్) మధ్య సీన్స్ అయితే థియేటర్‌లో గట్టిగా నవ్వులు పుట్టిస్తున్నాయని రివ్యూలు చెబుతున్నాయి. అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ కామెడీ ఇక్కడ బాగా క్లిక్ అయిందనే టాక్ బలంగా ఉంది. మొత్తానికి, ఫస్ట్ హాఫ్ = ఎంటర్టైనింగ్ + ఫీల్ గుడ్ + వింటేజ్ చిరు టోన్‌లో ఉందంటూ ప్రీమియర్స్ నుంచి పబ్లిక్ టాక్ నడుస్తోంది. అలాగే, సెకండ్ హాఫ్ సగం ఎమోషన్తో నడిస్తే.. మిగతా సగం కామెడీతో నడిచిందంటూ మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

మరో నెటిజన్ రివ్యూ షేర్ చేస్తూ క్లియర్గా తన అభిప్రాయం పంచుకున్నారు. 

‘మన శంకర వరప్రసాద్ గారు’ ఒక సగటు స్థాయి కామెడీ ఎంటర్టైనర్. సినిమాను చివరివరకు మోసుకెళ్లేది ఒక్కటే – చిరంజీవి నటన.

ఫస్ట్ హాఫ్

ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది. చిరంజీవి చాలా కాలం తర్వాత తన కామెడీ టైమింగ్‌ను బాగా చూపించారు. కొన్ని సీన్స్ నిజంగానే నవ్విస్తాయి. ప్రేక్షకులు చిరును చూసి ఎంజాయ్ చేస్తారు.

సెకండ్ హాఫ్

సెకండ్ హాఫ్ మొదట బాగానే మొదలవుతుంది. కానీ కొద్దిసేపటికి ఒకే తరహా కామెడీ రిపీట్ అవడం, నవ్వు రాని జోకులు, విలన్ ట్రాక్ బలహీనంగా ఉండటం, ఎక్కువ హైప్ ఇచ్చిన వెంకటేష్ ఎపిసోడ్ ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వకపోవడం వల్ల సినిమా డౌన్ అయిపోతుంది. కొన్ని చోట్ల కామెడీ వర్క్ అవుతుంది, కానీ చాలా సీన్స్ కృత్రిమంగా, ఫోర్స్ చేసినట్టుగా అనిపిస్తాయి.

నటీనటులు

ఈ సినిమా పూర్తిగా చిరంజీవి ఒక్కడిపైనే నిలబడింది. అతని ఎనర్జీ, కామెడీ, ఎమోషన్ అన్నీ బాగున్నాయి. నిజంగా ఇది వన్ మ్యాన్ షో.

పాటలు & సంగీతం

పాటలు బాగున్నాయి. కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బలహీనంగా ఉంది.

మొత్తానికి..

సంక్రాంతి సీజన్ కావడంతో కొంతమంది ప్రేక్షకులకు ఇది నచ్చొచ్చు. కానీ ఈ సినిమాకు ఉన్న స్టోరీ, స్టార్ పవర్ చూసుకుంటే.. 
ఇంకా చాలా బాగా తీయవచ్చు అనే ఫీలింగ్ మిగులుతుంది.

ఫైనల్ మాట:

“ఓకే… అంతే. ప్రత్యేకంగా ఏమీ లేదు.”