బుక్ రీడింగ్ తో ఆరోగ్యానికి మేలు

బుక్ రీడింగ్ తో ఆరోగ్యానికి మేలు

బుక్ రీడింగ్ ఒకప్పుడు రెగ్యులర్ హ్యాబిట్స్ లో ఒకటిగా ఉండేది. కలం స్నేహాల రోజుల్లో ‘నా హాబీలు’ అనే దగ్గర కచ్చితంగా బుక్ రీడింగ్ అని చెప్పేవాళ్లు. కానీ రానురానూ పుస్తకాలు చదవటం అనే అలవాటు తప్పింది. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా డిజిటల్ వీడియోల్లో కనిపిస్తున్నప్పుడు ఇంకా పుస్తకాలు చదవటం టైం వేస్ట్ అనే వాళ్లూ లేకపోలేదు. అయితే పుస్తకాలు చదవటం అనేది మన హెల్త్ కి కూడా చాలా హెల్ప్ చేస్తుందని చెబితే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ అది నిజం. కథ, నవల లాంటివే కాదు… రోజూ న్యూస్ పేపర్ చదివినా చాలు.

చదవటం వల్ల మన బ్రెయిన్‌కి ఎక్సర్‌‌సైజ్ అవుతుంది. 2013లో న్యూయార్క్​కు చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ సబ్రినా రోమనోఫ్ చేసిన స్టడీ ప్రకారం నవలలు, కథలు చదవటం వల్ల మెదడు షార్ప్ అవుతుంది. భాషపై పట్టు పెరుగుతుంది. 14 ఏళ్ల పాటు ఈ స్టడీ జరిగింది. భాషలో ఉండే కొన్ని లక్షల పదాలను లోడ్ చేసుకోవటం బ్రెయిన్ కి చాలా పెద్ద ఎక్సర్‌‌సైజ్.  రీడింగ్.. మెదడులో న్యూరాన్లను తయారు చేస్తుంది. ఇలా న్యూరాన్లు పెరగటాన్ని న్యూరోజెనిస్ అంటారు. మనం చదువుతున్నప్పుడు మెదడు చాలా ఇమేజెస్‌ని ఊహించుకుంటుంది. అవి మెమరీ రీకాల్‌ని పెంచాయి. మెమొరీ పవర్ పెరగాలంటే రెగ్యలర్ రీడింగ్ అవసరమని రోమనోఫ్ చెబుతున్నారు.

రోజూ 30 నిమిషాలు ఏదైనా పుస్తకం చదవటం వల్ల, స్ట్రెస్ తగ్గుతుందట. సబ్రినా రీసెర్చ్ లో 30 నిమిషాలు న్యూస్ పేపర్, సాహిత్యం, చరిత్ర పుస్తకాలు చదివిన వాళ్లలో పల్స్ రేట్, బీపీ, స్ట్రెస్‌ లాంటివి కంట్రోల్‌లో ఉన్నాయని తేలింది. అయితే క్రైం, థ్రిల్లర్స్ ఎక్కువగా చదివిన వాళ్లలో బీపీ పెరిగినా అది ఆన్‌లైన్ గేమ్స్, టీవీ చూసిన వాళ్లకంటే చాలా తక్కువగా ఉంది.

చదవడం వల్ల మెదడు పనితీరు పెరుగుతుంది. చదవడం వల్ల మతిమరుపు రావడానికి కూడా తక్కువ అవకాశం ఉందని సబ్రినా స్టడీ రిపోర్ట్ చెబుతోంది. చైనాలో 2018లో చేసిన మరో రీసెర్చ్ ప్రకారం ఐదేళ్ల కాలంలో 65ఏళ్ల వయసు ఉన్నవాళ్లని ట్రాక్ చేశారు. చదివే అలవాటు ఉన్నవాళ్లలో ఙ్ఞాపకశక్తి ఎక్కువగా ఉందని ఆ స్టడీలో తేలింది.