పిల్లలు పెద్దయ్యాక చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటే..

పిల్లలు పెద్దయ్యాక చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటే..

చిన్న పిల్లలు పెద్దవాళ్లయ్యాక చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలనుకుంటున్నారా? అయితే చిన్నప్పటి నుంచే ఎప్పుడూ హ్యాపీగా ఉండేలా పెంచాలి. ఎందుకంటే ఐదారేళ్లలోపు పిల్లలు ఎవరైతే, ఎక్కువ సంతోషంగా గడుపుతారో వాళ్లు, పెద్దయ్యాక చెడు అలవాట్లకు అంత దూరంగా ఉంటారని లేటెస్ట్‌‌గా ఒక స్టడీలో తేలింది. చిన్న వయసులో ఆనందంగా గడిపే పిల్లలు, టీనేజ్‌‌లోకి వచ్చాక బ్యాడ్‌‌ హాబిట్స్‌‌కు తక్కువ అలవాటు పడతారని ఈ సర్వే తేల్చింది. అమెరికాలోని ఇండియానాలోని పర్డ్యూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు స్టడీ చేసి, ఈ విషయాల్ని ఒక జర్నల్‌‌లో పబ్లిష్‌‌ చేశారు. దాదాపు రెండు వేల మంది స్టూడెంట్స్‌‌ని స్టడీ చేసి, ఈ విషయాల్ని గుర్తించారు. ఈ స్టడీ ప్రకారం.. చిన్నతనంలో హ్యాపీగా గడిపిన చిన్నారులు టీనేజ్‌‌లోకి అడుగుపెట్టాక స్మోకింగ్‌‌, డ్రింకింగ్‌‌, డ్రగ్స్‌‌ వంటి అలవాట్లకు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్నప్పటి పాజిటివ్‌‌ యాటిట్యూడ్‌‌, పెద్దయ్యాక చెడు అలవాట్లకు దూరంగా ఉండేందుకు సాయపడుతుంది. అందుకే చిన్న వయసులో పిల్లలు ఎలాంటి ఒత్తిడి, ఇబ్బందులకు గురికాకుండా చూడాలని సూచిస్తున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. ఎదిగే వయసు పిల్లలు సంతోషంగా ఉండటం వల్ల, వాళ్లలో పాజిటివ్‌‌ యాటిట్యూడ్‌‌ కూడా పెరుగుతుందంటున్నారు. ఈ విషయంలో పేరెంట్స్‌‌తో పాటు, టీచర్స్‌‌ది కూడా ఇంపార్టెంట్‌‌ రోల్‌‌ అంటున్నారు.