Good Health : బ్లాక్ కాఫీ తాగితే బరువు తగ్గుతారా.. ఇందులో నిజం ఎంత..!

Good Health : బ్లాక్ కాఫీ తాగితే బరువు తగ్గుతారా.. ఇందులో నిజం ఎంత..!

పొద్దున్నే ఘుమఘుమలాడే బెడ్ కాఫీ, సాయంత్రం రిలాక్స్ అయ్యేందుకు ఒక కాఫీ.. రోజులో ఎన్నిసార్లు తాగినా ఫస్ట్ టైం తాగుతున్న ఫీల్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది కాఫీ లవర్స్ కి. కానీ, మామూలు కాఫీ కంటే బ్లాక్ కాఫీ తాగితే హెక్కి మంచిది అంటున్నాయి స్టడీలు.

అమెరికా అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ (యుఎస్ ఎ) రిపోర్ట్ ప్రకారం ఒక కప్పు బ్లాక్ కాఫీలో రెండు క్యాలరీలు ఉంటాయట. అదే డి -కెఫినేటెడ్ బీన్స్ చేసిందయితే దానిలో క్యాలరీలు అసలు ఉండవు.మామూలుగా కాఫీలో ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం బెల్లం, చక్కెర, పాలు, వెనిల్లా, చాకొలెట్ సిరప్ వంటివి వాడడం వల్ల 700 క్యాలరీలు అవుతాయి. కాఫీలో ఉండే కెఫిన్ బ్రెయిన్, సెంట్రల్ నెర్వస్ సిస్టు యాక్టివ్ గా ఉంచుతుంది. ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది. కాబట్టి బ్లాక్ కాఫీని రోజు వారీ డైట్ తీసుకోవచ్చు. దానివల్ల తీపి కోసం బెల్లం, తేనె వంటివి మాత్రమే వాడతారు. దాంతో, క్యాలరీలు తగ్గుతాయి.

ఈజీగా వెయిట్ లాస్

బ్లాక్ కాఫీ బరువు త్వరగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. దీనిలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ అందుకు కారణం. మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం తర్వాత ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగితే, ఇందులో ఉన్న ఆ యాసిడ్, గ్లూకోజ్, కొవ్వు కణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. అంటే దానివల్ల క్యాలరీలు తగ్గినట్లే. రెగ్యులర్గా వర్కవుట్స్ చేసేవాళ్లయితే వర్కవుట్స్కు ముందే బ్లాక్ కాఫీ తాగడం మంచిది. దానివల్ల క్యాలరీలు బాగా ఖర్చవుతాయి. బ్లాక్ కాఫీ శరీరంలో అదనంగా ఉన్న నీళ్లని యూరిన్ ద్వారా బయటకు తుంది. ఇందులో ఉండే కెఫిన్ వల్ల జీర్ణక్రియ సరిగా జరుగుతుంది. ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. దానివల్ల ఆకలి కూడా తగ్గుతుంది. పైగా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటున్నారు "ఎక్స్పర్ట్స్.