క్రీడలతో ఆరోగ్యవంతమైన జీవితం ... కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

క్రీడలతో ఆరోగ్యవంతమైన జీవితం ... కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

పద్మారావునగర్, వెలుగు: క్రీడలకు వయస్సుతో సంబంధం లేదని, ఆరోగ్యవంతమైన జీవితానికి ఆటలు ఎంతో అవసరమని కంటోన్మెంట్​ ఎమ్మెల్యే శ్రీగణేశ్​ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్​ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని జింఖానా గ్రౌండ్స్​లో మాస్టర్స్  అథ్లెటిక్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్​ చాంపియన్​షిప్​– 2025 క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. 

30 ఏండ్ల వయస్సు పైబడిన వారికి నిర్వహించిన ఈ పోటీల్లో పాల్గొన్న వారిని ఎమ్మెల్యే అభినందించారు. విజేతలకు మెడల్స్​ అందచేశారు. కంటోన్మెంట్​ బోర్డు మాజీ వైస్​ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్​, కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.