క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. 

క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. 
  • టీ20 మ్యాచ్ సందర్భంగా రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు
  • మెట్రోరైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి

హైదరాబాద్: క్రికెట్ లవర్స్.. ఫ్యాన్స్ కు హైదరాబాద్ మెట్రోరైల్ గుడ్ న్యూస్. ఈనెల 25వ తేదీన భారత్ - ఆస్ట్రేలియా మధ్య టి20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అర్ధరాత్రి 12.30 వరకు మెట్రో సర్వీస్ లను నడుపుతామని మెట్రోరైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. అవసరమైతే రద్దీనీ దృష్టిలో ఉంచుకుని మరిన్ని సర్వీసులను నడుపడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. చాలా కాలం తర్వాత క్రికెట్ ప్రేమికులకు ప్రత్యక్షంగా స్టేడియంలో మ్యాచ్ తిలకించే అవకాశం రావడంతో టికెట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆన్ లైన్ లో గంటల తరబడి వేచి చూసినా ప్రయోజనం లేకపోవడంతో ఆఫ్ లైన్ లో సికింద్రాబాద్ జింఖానా మైదానంలో అమ్ముతున్నట్లు తెలుసుకుని భారీగా తరలివచ్చారు. అనూహ్యంగా తరలివచ్చి టికెట్ల కోసం తొక్కిసలాడుకోవడం.. లాఠీ చార్జ్ కు దారితీసింది. ఈ నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా అర్ధరాత్రి వరకు అదనపు మెట్రో సర్వీసులు నడుపుతామంటూ మెట్రో రైల్ ప్రకటన చేసింది.