క్రెడిట్​కార్డు బిజినెస్​లోకి LIC

క్రెడిట్​కార్డు బిజినెస్​లోకి LIC

ముంబై: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కూడా క్రెడిట్​కార్డు బిజినెస్​లోకి వచ్చింది.  ఐడీబీఐ బ్యాంక్ సహకారంతో ఇటీవల రూపే క్రెడిట్ కార్డ్‌‌ను ప్రారంభించింది.  లుమిన్ కార్డ్,  ఎక్లాట్ కార్డ్స్ పేరుతో వీటిని లాంచ్​ చేసింది.  కస్టమర్, పాలసీ హోల్డర్,  ఏజెంట్ అయితే  ఉచితంగా క్రెడిట్ కార్డ్‌‌  పొందవచ్చు.  వీటిని అందరికీ అందుబాటులో ఉంచాలనే  ఆలోచన కూడా ఉంది. ఈ క్రెడిట్ కార్డులతో అనేక లాభాలు ఉంటాయి. ఈ కార్డులు వాడుతూ  ఎల్ఐసీ ప్రీమియం చెల్లిస్తే,  రెట్టింపు రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. పెట్రోల్​ కొంటే ఫ్యూయల్​ సర్​చార్జ్​ ఉండదు.  లుమిన్,  ఎక్లాట్ కార్డ్‌‌లపై భారీగా క్రెడిట్ లిమిట్​ ఇస్తారు. లూమిన్ కార్డ్‌‌పై రూ.100 ఖర్చు చేస్తే  మూడు చొప్పున డిలైట్ పాయింట్‌‌లను పొందవచ్చు. ఎక్లాట్ క్రెడిట్ కార్డ్‌‌పై ఖర్చు చేసిన ప్రతి రూ.100కు  4 చొప్పున డిలైట్ పాయింట్‌‌లను పొందవచ్చు. కార్డులను ఉపయోగించి  ఎల్‌‌ఐసీ ప్రీమియం చెల్లిస్తే రివార్డు పాయింట్లు రెట్టింపు అవుతాయి. అంటే, ఖర్చు చేసిన ప్రతి వంద రూపాయలకు  ఆరు నుండి ఎనిమిది రివార్డ్ పాయింట్లు వస్తాయి. ఎల్ఐసీ ఐడీబీఐ ఎక్లాట్ కార్డ్ హోల్డర్లు ఎయిర్​పోర్టుల్లోని కాంప్లిమెంటరీ లాంజ్​లను ఉపయోగించుకోవచ్చు.  అంతేగాక రూ. 400 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే,  ఒకశాతం ఫ్యూయల్​ సర్‌‌ఛార్జ్ రీయింబర్స్‌‌మెంట్‌‌ను అందుకుంటారు. రూ.3000 కంటే ఎక్కువ విలువైనవి కొనుగోలు చేస్తే,  ఈ మొత్తాన్ని ఈఎంఐల రూపంలో కట్టవచ్చు. కార్డు పొందడానికి  ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఫోర్​క్లోజర్​ చార్జీలు వసూలు చేయరు.   ఈ క్రెడిట్ కార్డులు ప్రమాద బీమాను కూడా అందిస్తాయి. కార్డ్ హోల్డర్ మరణిస్తే  నామినీకి అదనపు కవరేజీ ఇవ్వడంతోపాటు క్రెడిట్ షీల్డ్ కవర్,  జీరో లాస్ట్ కార్డ్ వంటి లాభాలను అందిస్తారు.  ఈ కార్డ్‌‌ను కొన్నవెంటనే వెల్​కమ్​ బోనస్ పాయింట్‌‌లు కూడా లభిస్తాయి.  కార్డ్ అందుకున్న 60 రోజులలోపు రూ. 10,000 ఖర్చు చేస్తే,  1000 లేదా 1500 వెల్‌‌కమ్ బోనస్ డిలైట్ పాయింట్‌‌లను పొందవచ్చు.   వస్తువులను, గిఫ్ట్​ వోచర్లను కొనుగోలు చేయడానికి ఈ పాయింట్లను ఉపయోగించవచ్చు. కార్డుహోల్డర్లు యాన్యువల్​ ఫీ, మెంబర్షిప్​ఫీ చెల్లించాల్సిన అవసరం లే