తెలంగాణలో అంగన్ వాడీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ సంబరాలు మొదలు కానున్న నేపథ్యంలో వేడుకల్లో పాల్గొనేందుకు అంగన్ వాడీ టీచర్లకు ,హెల్పర్లకు వెసులుబాటు కల్పించింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు సర్క్యులర్ జారీ చేసింది. మధ్యాహ్నం 2 గంటల వరకు అంగన్ వాడీలో విధులు నిర్వర్తించిన తర్వాత బతుకమ్మ వేడుకల్లో పాల్గొనవచ్చని పేర్కొంది.
ALSO READ | పిల్లల్లారా.. రెండు వారాలు ఎంజాయి చేయండి..
బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 30నే ప్రారంభం అయ్యాయి. తొమ్మిది రోజులు పాటు బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి.