సామాన్యులకు గుడ్ న్యూస్.. పాత స్టాక్ కూడా కొత్త జీఎస్టీ రేట్లకు అమ్మాల్సిందే.. కంపెనీలకు కేంద్రం ఆదేశాలు

సామాన్యులకు గుడ్ న్యూస్.. పాత స్టాక్ కూడా కొత్త జీఎస్టీ రేట్లకు అమ్మాల్సిందే.. కంపెనీలకు కేంద్రం ఆదేశాలు

న్యూఢిల్లీ: తయారీదారులు అమ్ముడుపోని స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జీఎస్​టీ కొత్త రేట్ల ప్రకారం గరిష్ట చిల్లర ధర (ఎంఆర్​పీ)ని సవరించుకోవడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ మంగళవారం (సెప్టెంబర్ 09) అనుమతించింది. ఈ చర్య వినియోగదారులకు, కంపెనీలకు భారీ ఊరట కల్పించనుంది. 

జీఎస్​టీ రేట్ల సవరణకు ముందు తయారు చేసిన లేదా దిగుమతి చేసుకున్న అమ్ముడుపోని ప్యాకేజ్డ్​ వస్తువుల మీద తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులు కొత్త ఎంఆర్​పీని తప్పనిసరిగా ప్రకటించాలి.  స్టాంపింగ్, స్టిక్కర్​ అతికించడం లేదా ఆన్​లైన్ ప్రింటింగ్ ద్వారా వివరాలు తెలియజేయాలి.  

అసలు ఎంఆర్​పీ కూడా కనిపించేలా ఉండాలి. ఈ ధర మార్పును ప్రకటిస్తూ, తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులు కనీసం రెండు ప్రకటనలను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వార్తాపత్రికలలో ప్రచురించాలి.  డీలర్లకు, కేంద్ర ప్రభుత్వంలోని లీగల్ మెట్రాలజీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, రాష్ట్రాల,   కేంద్రపాలిత ప్రాంతాల లీగల్ మెట్రాలజీ కంట్రోలర్లకు నోటీసులను పంపాలి. 

ఈ అనుమతి డిసెంబర్ 31, 2025 వరకు లేదా స్టాక్ అయిపోయే వరకు, ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది వరకు చెల్లుబాటు అవుతుంది.