హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణించే వారికి శుభవార్త

హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణించే వారికి శుభవార్త

హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణించే వారికి శుభవార్త. హైదరాబాద్-విశాఖపట్నం హైవేలో భాగమైన ఖమ్మం -దేవరపల్లి నాలుగు లైన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇది అతి త్వరలోనే సాకారం కానుంది. ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. 2022, సెప్టెంబర్ లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) చేపట్టిన నాలుగు లేన్ల ప్రాజెక్ట్‌ కోసం రూ. 2,200 కోట్లు పెట్టుబడి పెట్టారు.  

ప్రస్తుతం ప్రాజెక్టుకు అవసరమైన 1,332 ఎకరాల్లో 95 శాతం భూమిని సేకరించారు. నాలుగు లేన్ల రహదారిని ఖమ్మం జిల్లాలో మూడు ప్యాకేజీలుగా విభజించారు. ఢిల్లీకి చెందిన కంపెనీ HG ఇన్‌ఫ్రా రెండు ప్యాకేజీలను చేపట్టగా.. APకి చెందిన KMV మిగిలిన ప్యాకేజీని నిర్వహిస్తోంది. 

2024 నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుందని NHAI ప్రాజెక్ట్ ఆఫీసర్ V దుర్గా ప్రసాద్ చెప్పారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే.. విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య 56 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. ప్రస్తుతం 8 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు వేశామన్నారు. భూసేకరణ కోసం రైతులకు రూ.200 కోట్లు ఇప్పటికే చెల్లించామన్నారు. మిగిలిన బ్యాలెన్స్ చెల్లింపు రూ.10 కోట్లు చెల్లిస్తామని తెలియజేశారు.