
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీఐఎంఈఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్–బి, గ్రూప్–సి పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 04.
పోస్టుల సంఖ్య: 114.
పోస్టులు: లీగల్ అసిస్టెంట్ 01, జూనియర్ టెక్నీషియన్(ల్యాబ్) 31, జూనియర్ టెక్నీషియన్ (ఎక్స్–రే) 06, జూనియర్ టెక్నీషియన్(రేడియోథెరపి) 03, టెక్నీషియన్ ఓ.టీ.04, డెంటల్ హైజెనిస్ట్ గ్రేడ్–2 02, అసిస్టెంట్ డైటీషియన్ 02, రిసెప్షనిస్ట్ 01, జూనియర్ ఆడిటర్ 01, నర్సింగ్ ఆఫీసర్ 51, స్టోర్ కీపర్ 01, జూనియర్ టెక్నీషియన్(ల్యాబ్) 06, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్(అప్పర్ డివిజన్ క్లర్క్) 02, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్(లోయర్ డివిజన్ క్లర్క్) 03.
ఎలిజిబిలిటీ: పోస్టులను అనుసరించి వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. పదోతరగతి, 12వ తరగతి, డిప్లొమా, ఎల్ఎల్బీ, బీఎస్సీ, బీకాం, ఏదైనా డిగ్రీ, సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎంబీఏ/ పీజీడీఎం, బీఎంఎల్ టీలోఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 18 నుంచి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: ఆగస్టు 04.
ALSO READ : బీటెక్ చేసినవారికి గుడ్ న్యూస్.. డీఓటీలో ఎల్డీసీ ఉద్యోగాలు..
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు pgimer.edu.in వెబ్ సైట్లో సంప్రదించగలరు.