
- బీజేపీపై ఎస్పీ ప్రెసిడెంట్ అఖిలేశ్ ఫైర్
రాంపూర్: యూనివర్సిటీ కట్టిన అజం ఖాన్‌ను జైల్లో పెట్టారని, రైతులను కారుతో గుద్ది చంపిన కేంద్ర మంత్రి కొడుకు బెయిల్‌పై బయట ఉన్నాడని ఎస్పీ ప్రెసిడెంట్ అఖిలేశ్‌యాదవ్ అన్నారు. ఇది బీజేపీ ‘‘న్యూ ఇండియా’’అని ఎద్దేవా చేశారు. యూపీలో ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల పరిస్థితులను చూస్తుంటే రాష్ట్రంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోయేట్టు ఉందని శుక్రవారం రాంపూర్‌లో ఎన్నికల మీటింగ్‌లో ఆయన పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడిన ఖాన్ కొడుకు అబ్దుల్లా ఆజంపై తప్పుడు కేసు లు పెట్టి రెండేండ్ల జైలు శిక్ష విధించారన్నారు. ఖాన్ రాంపూర్‌లో జౌహర్‌లో యూనివర్సిటీని నిర్మించారని, అలాంటి వ్యక్తిపై వివిధ ఆరోపణలు రావడంతో సీతాపూర్‌లో జైలులో ఉన్నారన్నారు. యువతకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చామని చెబుతున్న సీఎం యోగి.. రాంపూర్‌లో ఒక్కరికి కూడా ఇవ్వలేదని అఖిలేశ్ ఆరోపించారు. బీజేపీ లీడర్లు మస్తు అబ్ధదాలు చెబుతారన్నారు.