
ఈ మధ్య ఎక్కువమంది పెళ్లైన కొద్దికాలానికే విడాకులు తీసుకుంటున్నారు. చాలా మంది పెళ్లి తర్వాత ప్రాబ్లమ్స్ కు ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారు. కొద్ది రోజుల రిలేషన్ షిప్ లోనే పార్ట్ నర్ పై ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకుంటున్నారు. అంతేకానీ, తమలో ఏ లోపం ఉంది? దాన్ని ఎలా మార్చుకోవాలి? రిలేషన్ షిప్నిప్ ను తిరిగి ఎలా నిలబెట్టుకోవాలి? మొదలగు విషయాలను తెలుసుకుందాం.
ప్రతి ఇంట్లో చిన్న చిన్న గొడవలు.. మనస్పర్దలు కామన్.. ఆ సమయంలో ఒకరి తప్పులు మరొకరు ఎంచుకోకుండా.. పరిష్కరించుకోవాలి.. పెద్దలదగ్గర సమస్యను పరిష్కరించుకోవాలి. అప్పుడే రిలేషన్ షిప్ కలకాలం ఉంటుంది. కాని ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలకే రిలేషన్ ఫిప్ ను బ్రేక్ చేసుకుంటున్నారు. అలా కాకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఆలోచించడం లేదు.
తన భర్త ఎప్పుడూ రెగ్యులర్ గా ఆమె సెల్ ఫోన్ చెక్ చేస్తుంటాడనే కారణంతో ఈమధ్యే విడాకులు తీసుకుంది ప్రవీణ. ఆ తర్వాత ఏడాదికి మరో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. రెండో మ్యారేజ్ కూడా ఇప్పుడు ప్రాబ్లమ్లోనే ఉంది.
భార్య జాబ్ చేయకుండా, ఇంటిపట్టునే ఉండాలనేది రిష్వంత్ కోరిక. కానీ, భార్య మాత్రం జాబ్ చేస్తానంది. దీంతో ఇద్దరికీ సరిపడక డివోర్స్ తీసుకున్నారు. కానీ, రిష్వంత్ డివోర్స్ తీసుకున్న రీజన్ చాలా మందికి నచ్చలేదు. దీంతో చుట్టుపక్కల వాళ్ల నుంచి విమర్శలు.
కారణాలేవైతేనేం.. విడాకులు తీసుకోవడం ఈజీ. కానీ, ఆ తర్వాత పరిణామాల్ని ఎదుర్కోవడమే కష్టమైన విషయం చిన్నచిన్న కారణాలు, పరిష్కరించుకోగలిగే ప్రాబ్లమ్స్ అయినా డివోర్స్ తీసుకుంటున్న జంటలు ఆ తర్వాతి సిట్యుయేషన్స్ ను హ్యాండిల్ చేయలేకపోతున్నాయి.
సెల్ఫ్ రెస్పెక్ట్ : పార్ట్నర్ నుంచి వేధింపులు, ఆంక్షలు ఎదురైనా, సరిగ్గా అర్థం చేసుకోకపోయినా, కెరీర్ విషయంలో సపోర్ట్ చేయకపోయినా, ఎక్స్ ట్రా మారిటల్ రిలేషన్స్ ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదురైనా... ఇలా బోలెడన్ని కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు. అన్నింటికంటే ఎక్కువగా పార్ట్నర్ నుంచి కోరుకునేది సెల్ఫ్ రెస్పెక్ట్. అది పోగొట్టుకుని, అడ్జస్ట్ అవ్వడం ఇష్టంలేక విడాకులు కోరుతున్నారు. అదే సెల్ఫ్ రెస్పెక్ట్ విడాకుల తర్వాత కూడా దక్కేలా చూసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ నుంచి సహకారం అందినప్పుడే ఇది సాధ్యం.
ఫ్యామిలీ సపోర్ట్ : కూతురు లేదా కొడుకు విడాకులుతీసుకోవాలనుకుంటే అందుకు కారణాలను పేరెంట్స్ తెలుసుకోవాలి. ఒకవేళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగి, తిరిగి వాళ్ల రిలేషన్ షిప్ను గాడిలో పెట్టగలమనుకుంటే ఆ ప్రయత్నం చేయాలి. కుదరని పక్షంలో, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవచ్చు. అయితే ఈ టైమ్ లో కచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపోర్ట్ ఉండాలి.
మరో రిలేషన్ : ఒకరి నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఏదో ఒక టైమ్ లో మరో రిలేషన్ షిప్ స్టార్ట్ చేయొచ్చు. అయితే మరో రిలేషన్ షిప్కి వెళ్లేముందు ఎవరికివాళ్లు కొన్ని విషయాల్లో రియలైజ్ అవ్వాలి. పాత రిలేషన్ షిప్ లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడూ అలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి? ఒకవేళ మళ్లీ అదే పరిస్థితి వస్తే తట్టుకోగలరా? ఇవన్నీ ఆలోచించుకోవాలి. సరైన పార్ట్నర్ అనుకున్నప్పుడే కమిట్ అవ్వాలి.
సమస్య మీలోనే ఉందా? : విడాకులు తీసుకున్నప్పుడు ప్రతిసారీ పొరపాటుపార్ట్నర్దే అయ్యుండక్కర్లేదు. ఇందులో మీ వైపు నుంచి ఏదైనా సమస్య ఉందేమో ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు రెండోసారి కూడా అదే కారణాలతో విడాకులు తీసుకుంటున్న జంటలు కూడా ఉన్నాయి. అంటే సమస్య వాళ్లలోనే ఉంది. తమ లోపాన్ని సరిదిద్దుకోలేకపోతే, అడ్జస్ట్ కాలేకపోతే ఏ రిలేషన్ షిప్ అయినా తొందరగానే బ్రేక్ అవుతుంది. అన్నింటికీ మించి సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ ను కలిసి కౌన్సెలింగ్ తీసుకుంటే ఉపయోగం ఉంటుంది.
కెరీర్ ప్లాన్ : రిలేషన్షిప్ బ్రేక్ అయితే బాధపడుతూ కూర్చోకుండా, దాని నుంచి త్వరగా బయటపడే ప్రయత్నం చేయాలి. ఆడవాళ్లైతే ఏదో ఒక కెరీర్ పై దృష్టిపెట్టాలి. మగవాళ్లైనా కెరీర్ లో మరింతగా ఎదిగేందుకు ప్రయత్నించాలి. అలాగే వీలైనంత సోషల్ గా ఉండేందుకు ప్రయత్నించాలి. మిమ్మల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నించాలి.
దీనివల్ల ఒకసారి విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలానికి మరో రిలేషన్ షిప్ లో కూడా ఇవే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మ్యారేజ్ లైఫ్ లో ఎక్కువ ప్రాబ్లమ్స్ చుట్టూ ఉన్న విషయాలు, పార్ట్నర్ నుంచి కాకుండా 'తన' నుంచే వస్తున్నాయని తెలుసుకుని, మార్చుకుంటే రిలేషన్షిప్ బాగుంటుంది. అవసరమైతే సైకాలజిస్ట్ సాయం తీసుకోవాలి.