Good Sleep: మంచి ఆరోగ్యం.. మంచి నిద్ర.. ఇలా చేయండి.. బెడ్ ఎక్కడంతోనే నిద్ర ముంచుకొస్తుంది..!

Good Sleep:  మంచి ఆరోగ్యం.. మంచి నిద్ర.. ఇలా చేయండి.. బెడ్ ఎక్కడంతోనే నిద్ర ముంచుకొస్తుంది..!

కళ్లేంటి ఎర్రగా ఉన్నాయ్ అంటే... రాత్రంతా నిద్ర పట్టలేదు అంటారొకరు. నిద్ర సరిపోక తల పగిలిపోతోంది అంటారింకొకరు... నిద్ర.. నిత్యావసరం. ఎంత నిద్రపోతే అంత ఆరోగ్యం. కానీ మనదేశ జనాభాలో ముప్పై శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఏమిటి దానికి కారణం? ఎలా దాన్ని అధిగమించడం అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .

మనిషి ఆరోగ్యంగా జీవించడానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. కానీ రానురాను మనుషుల్లో నిద్రలేమి సమస్య పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. అలా అని దానికి పెద్ద పెద్ద కారణాలేమీ లేవట. జీవన విధానం సరిగ్గా లేకపోవడం, చెడు అలవాట్లు, మానసిక ఒత్తిడి వంటివే నిద్ర పట్టనివ్వడం లేదట. అందుకే జీవన శైలిలోనూ, అలవాట్లలోనూ చిన్నపాటి మార్పులు చేసుకోమంటున్నారు డాక్టర్లు.  కేవలం పది చిట్కాలతో ప్రశాంతంగా నిద్రపోవచ్చంటున్నారు.

వ్యాయామం తప్పనిసరి.. చాలా పని చేస్తున్నాం, ఒళ్లు అలసిపోతుంది, అంతకంటే. ఎక్సర్సైజ్ ఎందుకు అనుకుంటారు. కానీ పని పనే, వ్యాయామం వ్యాయామమే. పని చేసేటప్పుడు మైండ్ యాక్టివ్ అవుతుంది. కొన్నిసార్లు ఆలోచనలు ఎక్కువై ఒత్తిడీ పెరుగుతుంది. అదే ఎక్సర్ సైజ్ చేస్తే శరీరంతో పాటు మైండ్ కూడా రిలాక్స్​ అవుతుంది

బెడ్రూమ్ ను జాగ్రత్తగా అమర్చుకోవాలి. చక్కగా సరైన. బెడ్రూమ్ లో అడుగు పెడితే మనను ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర దానంతటదే వచ్చేస్తుంది. కాబట్టి బెడ్రూమ్ ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కర్టెన్లు, దుప్పట్లు శుభ్రంగా పెట్టుకోవాలి. అలాగే పరుపు దిండ్లూ కూడా సౌకర్యంగా ఉండాలి. పడకగది ఎటువంటి శబ్దాలూ. లేకుండా ప్రశాంతంగా ఉండాలి.

రోజు ఒక సమయానికి నిద్రపోవాలి. ఒకే సమయానికి లేవాలి. నిద్రపోయే సమయాలు మారిపోతూ ఉంటే కొన్ని రోజలకి నిద్రపట్టని పరిస్థితి వస్తుంది.

కాఫీ, టీలను తగ్గించాలి.  పని ఒత్తిడిని తట్టుకోలేక  అలవాటైపోయిన కప్పులకు ... కప్పులు టీ, కాఫీలూ లాగించేస్తుంటారు. అలా చేసేవాళ్లకి నిద్ర అంతకంతకూ దూరమైపోతుందట. పడుకునే ముందు ఇవి అస్సలు తాగకూడదు

కంప్యూటర్లకి కాస్త దూరంగా ఉండాలి.  పని ఉన్నప్పుడు కంప్యూటర్  ముందు  ఉండొచ్చు. ఏమీ ఊసుపోనప్పుడు కాసేపు టీవీ చూడొచ్చు. కానీ అదే పనిగా వాటికి అలవాటు పడిపోవడం వల్ల కూడా సమస్య వస్తుంది. ఏవో విషయాలు మైండ్​ లోకి వెళ్లడం వల్ల మెదడు యాక్టివ్ గా ఉండి నిద్ర దూరమౌతుంది.

కడుపు నిండా తిని మంచమెక్కద్దు. నిద్రపోవడానికి కనీసం రెండు మూడు గంటల ముందు నుంచి ఏమీ తినకూడదు, త్రాగకూడదు.. బరువైన పొట్ట నిద్రను డిస్టర్బ్​ చేస్తుంది. పానీయాలు ఎక్కువ తీసుకుంటే మధ్యలో బాత్రూమ్ కి లేవాల్సి వస్తుంది. వీటివల్ల నిద్రాభంగం తప్పుదు.

ఖాళీ కడుపుతో మంచం ఎక్కకండి.మితంగా తినాలి .. మితమైన ఆహారం తీసుకోవాలి. తగిన గ్యాప్ తర్వాత పడుకోవాలి. అంతే తప్పు ఆకలి.. కడుపుతో నిద్రపోదామని ప్రయత్నిస్తే ఎంతసేపైన ఎదురు చూసేవా? అని పాడుకోవాల్సిందే.

పోన్​ కు గుడ్​ నైట్​ చెప్పాలి. పడుకునేముందు ముందు మీ పోన్ సైలెన్స్ మోడ్లో పెట్టాలి. ఆఫ్ చేసేస్తే ఇంకా మంచిది. లేదంటే మెసేజీలు, కాల్స్ వచ్చి డిస్టర్బ్​ చేస్తాయి. వచ్చే నిద్ర రాకుండా పోతుంది. మనసును కంట్రోల్ చేయాలి. చాలామంది పడుకుని ఆరోజు జరిగినవన్నీ తలచుకుంటూ ఉంటారు. ఎక్కడ ఉస్నవారి గురించో మర్నాడు చేయాల్సిన పనుల గురించే ఆలోచిస్తారు. దాంతో నిద్ర రమ్మన్నా రాదు. మనసును కంట్రోల్ చేయగలిగితే మంచి నిద్ర ఖాయం

అలారం మనసులోనే మోగాలి. ఒక సినిమాలో హీరో అలారం పెట్టుకుని కరెక్ట్​ గా  పెట్టానా లేదా అని ఒకసారి మోగుతుందో లేదోనని మరోసారి మోగినా వినపడలేదేమోనని .. ఇంకోసారి ఇలా మాటిమాటికి లేచి దాన్ని చూస్తుంటాడు. ఇలా చాలామంది -చేస్తుంటారు. ఇలా చేస్తూ పోతే నిద్రపోయేది ఎప్పుడు  మరి..  కాబట్టి అవేమీ ఆలోచించకుండా మంచి నిద్రపోండి.. 

‌‌వెలుగు,లైఫ్​‌‌