మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలోకి గూడెం మధుసూదన్ రెడ్డి

మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలోకి గూడెం మధుసూదన్ రెడ్డి

పోలీస్ కస్టడీకి మధుసూదన్ రెడ్అక్రమ మైనింగ్​ కేసులో పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డిని మార్చి 15వ తేదీన  పోలీసులు ఆరెస్ట్  చేసిన  సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో  మధుసూదన్ రెడ్డికి 14 రోజుల పాటు జిల్లా కోర్టు రిమాండ్ విధించింది.  దీంతో ఇవాళ్టి నుంచి అంటే మార్చి 21 వ తేదీ నుంచి మార్చి 23 వరకు మూడు రోజుల పాటు మధుసూదన్ రెడ్డిని  పోలీస్ కస్టడీలోకి తీసుకోనున్నారు.  ఈ విచారణలో మధుసూదన్ రెడ్డి స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డు చేయనున్నారు. ప్రస్తుతం ఆయన కంది జిల్లాలోని జైలులో ఉన్నారు.  

మధుసూదన్ రెడ్డికి సంబంధించిన సంతోష్ సాండ్ మైనింగ్ కంపెనీని మూసేయాలని ఏడాది క్రితమే అధికారులు నోటీసులు ఇచ్చారు. అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండడం వల్ల అది సాధ్యపడలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత ఫిబ్రవరిలో అక్రమ మైనింగ్ పై దృష్టి పెట్టి సంతోష్ సాండ్ మైనింగ్ కంపెనీ తోపాటు ఇదే గ్రామంలోని సర్వే నెంబర్ 738/1 లో ముత్తిరెడ్డి, జెరిపెట్టి వడ్డెర వెల్ఫేర్ అసోసియేషన్, రుద్రారంలోని సర్వే నెంబర్ 132లో మల్లికార్జునరావు క్వారీ, చిట్కుల్ గ్రామంలో సర్వే నెంబర్ 472లో శ్రీనిధి మెటల్ ఇండస్ట్రీ క్వారీలు అక్రమంగా కొనసాగుతున్నట్టు గుర్తించి వాటిపై చర్యలు చేపట్టారు.