
షెడ్యూల్ ప్రకారం గూడ్స్ రైలును ఓ స్టేషన్ లో నిలిపివేశారు. ఆ సమయంలో అందులో డ్రైవర్ లేడు. కొంత సేపటి తర్వాత ఆ గూడ్స్ రైలు దానంతట అదే కదిలింది. అంతే కాదు ముందుకు కదులుతూ పరుగుతీయం మొదలు పెట్టింది. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది రైలు ను ఆపేందుకు ప్రయత్నం చేశారు. చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 50 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత దానంతట అదే నిలిచిపోయింది. ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది.
ఎల్‌ఎండ్‌టీ సంస్థకు చెందిన మెటీరియల్ తరలిస్తున్న ఓ గూడ్స్ రైలును రాజస్థాన్‌లోని సెంద్రా రైల్వేస్టేషన్‌లో డ్రైవర్ నిలిపి ఉంచాడు. లోకో పైలట్ కిందికి దిగిన కాసేపటికి రైలు దానంతట అదే కదిలి మెల్లగా స్పీడందుకుని.. స్టేషన్ దాటిపోయింది. పరిస్థితి గమనించిన అధికారులు తర్వాత స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే అలర్టైన రైల్వే సిబ్బంది దారిలో ఉన్న రైల్వే గేట్లన్నింటినీ మూసివేయించారు. పట్టాలపై రాళ్లు, ఇసుక బస్తాలు వేయించారు. అయినా ఫలితం లేకపోయింది. దాదాపు 50 కిలోమీటర్లు ప్రయాణించాక సోజాత్ స్టేషన్ దగ్గర రైలు దానంతట అదే నిలిచిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంజిన్ ఆన్‌లో ఉండగా లోకోపైలట్ నిర్లక్ష్యంగా కిందకు దిగడంతోనే ఇలా జరిగిందని పలువురు వ్యాఖ్యానించారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు అధికారులు.