దరిద్రం వదిలింది: 2 వేల 500 లోన్ యాప్స్ రిమూవ్

దరిద్రం వదిలింది: 2 వేల 500 లోన్ యాప్స్ రిమూవ్

 ఢిల్లీ: గూగుల్‌ తన ప్లేస్టోర్‌ నుంచి 2,500 లోన్ యాప్ లను తొలగించినట్టు కేంద్రం వెల్లడించింది. 2021 ఏప్రిల్‌ నుంచి 2022 జులై మధ్య ఈ చర్యలు తీసుకుందని పార్లమెంటులో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

ఈ విషయంలో రిజర్వు బ్యాంకు, ఇతర నియంత్రణ సంస్థలతో కేంద్రం ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉందన్నారు. చట్టబద్ధంగా నడుస్తున్న లోన్‌ యాప్‌ల వివరాలను రిజర్వు బ్యాంకు ప్రభుత్వానికి అందించిందని, ఆ వివరాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీశాఖ గూగుల్‌కు పంపిందని తెలిపారు.

గూగుల్‌ తన విధివిధానాలను పటిష్ఠం చేసిందని వెల్లడించారు.కొత్త విధానంలో సమ్మతి పొందిన యాప్‌లనే ఆ సంస్థ ప్లేస్టోర్‌లో అనుమతిస్తోందని  చెప్పారు.