స్మార్ట్​ కంపోజ్​ ఫీచర్ ప్రవేశపెట్టిన గూగుల్​

స్మార్ట్​ కంపోజ్​ ఫీచర్ ప్రవేశపెట్టిన గూగుల్​

గూగుల్​ చాట్ లో కొత్త స్మార్ట్​ కంపోజ్​ ఫీచర్​ను  ప్రవేశపెట్టినట్లు గూగుల్​ ప్రకటించింది. మెషిన్​ లెర్నింగ్​ఆధారిత ఈ ఫీచర్..​ యూజర్లు టైప్​ చేసేటప్పుడు తగిన పదాలను సూచించడం, పొందికైన వాక్యాలు రూపొందించడం, తప్పుల్ని గుర్తించడం, లోపాల్ని సరిచేయడానికి ఉపయోగపడుతుంది.

ఈ ఫీచర్​ ఇంగ్లీష్​, స్పానిష్​, పోర్చుగీస్​, ఫ్రెంచ్​, ఇటాలియన్​తో సహా పలు భాషల్లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది మార్చిలో గూగుల్​ చాట్​లో స్పేసెస్​ మేనేజర్​ కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావాలని గూగుల్​ భావించింది. షేరింగ్​ స్పేస్​ నుంచి వ్యక్తులను, ఓ సమూహాన్ని సులభంగా తీసేయడానికి, కలపడానికి ఈ ఫీచర్​ తోడ్పడనుంది.