గూగుల్ (Google) తన వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ (I/O)ను అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహించేందుకు సిద్ధమైంది. I/O అనేది టెక్ దిగ్గజం గూగుల్ కు సంబంధించిన తాజా విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న డెవలపర్‌ల కోసం నిర్వహించే అతిపెద్ద వార్షిక ఈవెంట్. ఆండ్రాయిడ్ (Android), పిక్సెల్( Pixel) పరికరాల్లో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ను తెలిపేందుకు Google ప్రతి సంవత్సరం I/Oని నిర్వహిస్తోంది.
అత్యంత ఆసక్తికరమైన ఈ పోగ్రామ్ ను ఎలా చూడాలి.. లైవ్ స్ట్రీమింగ్ ను ఎలా చూడాలన్న విషయాలపై ప్రస్తుతం చర్చ మొదలైంది. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Google I/O 2023 లాంచ్ ఈవెంట్ మే 10వ తేదీ రాత్రి 10:30 గంటలకు భారతదేశంలో ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్ యూట్యూబ్ (YouTube)లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం I/O Google వివిధ సోషల్ మీడియా సైట్ల ద్వారానూ ఆన్‌లైన్‌లో ప్రసారం చేసేందుకు వీలు కల్పించింది. వీటికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం యూజర్స్ io.google.comలో సైన్ అప్ అయ్యి, వివరాలను తెలుసుకోవాలని సూచించింది.
ఈ Google I/O ఈవెంట్ లో కొత్త సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ప్రాడక్ట్స్ తో పాటు Google Android 14ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ChatGPT మాదిరిగానే Google తీసుకువచ్చే ఉత్పాదక AI బోర్డ్‌పై Google మరింత సమాచారాన్ని అందించనున్నట్టు సమాచారం. వీటితో పాటు కొత్త ఫీచర్లు, యాప్ లు, ఇతర సేవలు కూడా ఈ ఈవెంట్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హార్డ్‌వేర్ పరంగా, పిక్సెల్ 7a, పిక్సెల్ ఫోల్డ్, పిక్సెల్ ప్యాడ్ మే 10న అధికారికంగా అందుబాటులోకి వస్తాయని గూగుల్ ఇప్పటికే ధృవీకరించింది. ఈ ఉత్పత్తుల్లో కొన్ని మే 11న భారతదేశంలో సేల్స్ కి అవకాశం ఉంది. దాంతో పాటు Pixel Buds A 2nd Gen వంటి ఉత్పత్తులను కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇది Google నుంచి లభించే TWS-స్టైల్ ఇయర్‌ఫోన్. అంతేకాకుండా, కంపెనీ అధికారికంగా టెన్సర్ G3-పవర్డ్ పిక్సెల్, పిక్సెల్ 8 ప్రో, పిక్సెల్ వాచ్ 2ని లాంఛ్ చేయనుంది.
