గూగుల్ మ్యాప్స్ చూస్తూ దారి తప్పారు.

గూగుల్ మ్యాప్స్ చూస్తూ దారి తప్పారు.
  • ప్రయాణికులకు తప్పు దారి చూపించి తిప్పలు
  • ట్విట్టర్ ద్వారా గూగుల్ పై విరుచుకుపడ్డ బాధితులు

ఏదైనా కొత్త చోటుకు వెళ్లాలంటే ఏం చేస్తారు? అదేం పిచ్చి ప్రశ్న.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంచుకుని అంటారా. కావొచ్చు. అయినా చెప్పండి. ‘ఏముందోయ్.. గూగుల్ మ్యాప్స్​లో చూసుకుని, మెల్లగా అక్కడికి చేరుకుంటాం’ ఇదే మీ సమాధానమైతే  ఒక్కసారి ఈ స్టోరీ చదవండి. కెనడాలోని అరోరాకు చెందిన ఓ వందల మంది యువకుల బృందం కార్లలో ట్రిప్​కు బయల్దేరింది. వాళ్లందరూ డెన్వర్ ఎయిర్ పోర్టుకు వెళ్లాలని మ్యాప్స్​లో దారి చూసుకున్నారు. తీరా సగం దూరం వెళ్లాక.. మెయిన్ రూట్​ను యాక్సిడెంట్ వల్ల మూసేశారని అర్థమైంది.

మ్యాప్స్ మరో మార్గాన్ని చూపించడంతో దాన్ని వెంబడి ప్రయాణించడం మొదలుపెట్టారు. వెళ్లారు.. వెళ్లారు.. వెళ్లారు.. ఎంతసేపు పోయినా.. ఎయిర్ పోర్టు మాత్రం రావడం లేదు. కొన్ని గంటల తర్వాత ఓ బురద రోడ్డు వచ్చింది. అయినా ముందుకుసాగారు. చివరకు పొలాలు రావడంతో ఆగిపోయారు. ఎటు పోవాలో అర్థం కాలేదు. కొన్ని కార్లు బంకమట్టిలో ఇరుక్కుపోయి కదల్లేదు. దీంతో వెనక్కు తిరిగి ఎలా వెళ్లాలో దిక్కుతోచలేదు.

గూగుల్ మ్యాప్స్ యాప్​లో వచ్చిన చిన్న సమస్యే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ యువకులు మాత్రమే కాకుండా చాలా మంది మ్యాప్స్​లో వచ్చిన సమస్య వల్ల ఇబ్బందులపాలయ్యారు. మట్టిలో ఇరుక్కుపోవడం వల్ల చాలా మంది కార్లకు రిపేర్లు అయ్యాయి. దీంతో ట్విట్టర్ ద్వారా గూగుల్​పై పలువురు విరుచుకుపడ్డారు. మీరు చాలా తప్పులు ఒకేసారి చేయగలరంటూ హేళన చేశారు.