
న్యూఢిల్లీ: పేటీఎం, ఫోన్‌పే మాదిరే గూగుల్‌పే కూడా యూపీఓ పేమెంట్స్ కోసం సౌండ్‌పాడ్‌లను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. కస్టమర్ మర్చంట్‌కు డబ్బు పంపగానే ఈ సౌండ్పాడ్ ఆడియో మెసేజ్‌ను వినిపిస్తుంది. ఇది పేటీఎం సౌండ్‌బాక్స్ మాదిరిగానే ఉంటుంది. రాబోయే నెల్లో కోట్లాది మంది మర్చంట్ల వద్ద ఈ సదుపాయం ఉంటుందని గూగుల్ పే, ప్రొడక్ట్ వైస్– ప్రెసిడెంట్ అంబరీష్ కెంఘే తెలిపారు. సౌండ్పాడ్ తీసుకున్న మర్చంట్లకు క్యాష్‌బ్యాక్‌లు కూడా ఉంటాయని చెప్పారు.