చైనాలో ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ తొలగింపు

చైనాలో ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ తొలగింపు

అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాలో ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను తీసివేస్తున్నట్లు వెల్లడించింది. చైనాలో ఎక్కువగా ఆ ఫీచర్‌ని వినియోగిచడం లేదని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని గూగుల్ స్పష్టం చేసింది. గూగుల్‌కు సంబంధించిన ఇతర ఫీచర్స్, ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండనున్నాయి. కొంతమంది వినియోగదారులు మొదటగా సెప్టెంబర్ 30న ఈ సేవలు నిలిచిపోయాయని గమనించారు. వినియోగదారులు Google Translate పాత మెయిన్‌ల్యాండ్ చైనా చిరునామాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, వారిని హాంకాంగ్ సైట్‌కి దారి మళ్లించారు. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, గూగుల్ ట్రాన్స్‌లేట్ హాంగ్ కాంగ్ వెర్షన్ VPN లేకుండా చైనా ప్రధాన భూభాగంలో అందుబాటులో లేదని ఇంటర్నెట్ దిగ్గజం చెప్పకనే చెప్పింది.

గూగుల్ తన అనువాద సేవలను 2017లో చైనాలోని మెయిన్‌ల్యాండ్‌లో ప్రవేశపెట్టింది. చైనాలోని వ్యక్తులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక యాప్‌ను సైతం కంపెనీ ప్రారంభించింది. ఈ విషయంలో గూగుల్ అధికారికంగా ఎటువంటి పత్రికా ప్రకటనను విడుదల చేయనప్పటికీ, చైనాలో దాని అనువాద సేవలను నిలిపివేసినట్లు పరోక్షంగా తెలియజేసింది. ఇదిలా ఉండగా కొన్ని చైనా యాప్స్ పై భారత్ నిషేధం ప్రకటించింది. టిక్ టాక్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్ లాంటి చాలా యాప్స్ ను నిషేధించడంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు సైతం ఉపయోగిస్తున్న ఈ మెయిల్ సర్వీస్ జీ మెయిల్‌పై చైనాలో నిషేధం ఇప్పటికే అమలులో ఉంది. వాట్సాప్ యాప్ కూడా చైనా నిషేధం విధించింది. వాట్సాప్ స్థానంలో చైనావాళ్లు క్యూక్యూను ఉపయోగిస్తారు.