పదేండ్ల తర్వాత ఫస్ట్ టైమ్.. గూగుల్ లోగో మారుతుంది.. ఆండ్రాయిడ్ 16 అప్డేట్స్ ఇవే..!

పదేండ్ల తర్వాత ఫస్ట్ టైమ్.. గూగుల్ లోగో మారుతుంది.. ఆండ్రాయిడ్ 16 అప్డేట్స్ ఇవే..!

గూగుల్ అంటే తెలియని వారుండరేమో. ఎందుకంటే ఏ ఫోన్ తీసుకున్నా.. ఏ కంప్యూటరలోనైనా గూగుల్ సెర్చ్ ఇంజిన్ లేకుండా ఊహించలేం. ఏదైనా వెతకాలంటే ‘‘గూగుల్ చెయ్..’’ అనే వాడుక పదంలోకి మారిపోయిందంటే ఎంతలా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.

గూగుల్ పదేండ్ల తర్వాత మొదటి సారి గూగుల్ లోగో మార్చుతోంది. అంటే గతంలో చివరిగా 2015, సెప్టెంబర్ 1న గూగుల్ ఐకాన్ మార్పు చేసింది. అంతకు ముందు వైట్ కలర్ లోయర్ కేస్ లో ‘google’ అని ఉండేది కంపెనీ లోగో. 2015లో గూగుల్ కు బదులుగా క్యాపిటల్ ‘G’ అనే అక్షరాన్ని తీసుకొచ్చారు. రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ కాంబినేషన్ లో వచ్చిన ఈ లోగోకు దాదాపు అందరూ అలవాటు పడిపోయారు. గూగుల్ అంటే G అక్షరం గుర్తొచ్చేలా మారిపోయింది. 

ఇప్పటి వరకు ఉన్న లోగో సింబల్ లో 4 కట్లరు విడివిడిగా.. ఒక కలర్ కు మరో కలర్ కు మధ్యలో కట్ ఉన్నట్లుగా.. సపరేట్ గా ఉండేది. అయితే కొత్త లోగోలో కలర్స్ మధ్య కట్ లేకుండా బ్లెండింగ్ అయ్యేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం స్మూత్ బ్లెండింగ్ తో లోగోను తీసుకొచ్చారు. అంటే ఎల్లో లోకి రెడ్ ఫ్లో అవుతున్నట్లు.. గ్రీనో లోకి ఎల్లో.. బ్లూ లోకి గ్రీన్ ఫ్లో అయినట్లుగా బ్లెండ్ అయ్యి ఉంటాయి కలర్స్. ఇది వైబ్రంట్ గా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే అప్డేటెడ్ ఐకాన్ ను గూగుల్ లో చూడవచ్చు. 

గూగుల్ iOS అప్ డేట్ చేసుకున్న వాళ్లకు, గూగుల్ యాప్ అప్ డేట్ చేసుకున్న ఆండ్రాయిడ్ యూజర్లకు కనిపిస్తుంది. అయితే గూగుల్ లోగో ఒక్కటే మారుతుందా.. గూగుల్ ఇతర యాప్స్ కు సంబధించిన లోగోలు కూడా మారుతాయా అనే దానిపై స్పష్టత లేదు. 

అదే సమయంలో గూగుల్ ఆండ్రాయిడ్ అప్ డేట్ ను కూడా తీసుకొచ్చింది. ఫ్రెష్ లుక్ తో ఆండ్రాయిడ్ 16 అప్డేట్ ను సిద్ధం చేసింది గూగుల్. ఈ అప్డేట్ లో క్విక్ సెట్టింగ్ ప్యానెల్ తీసుకొచ్చింది. స్క్రీన్ ను స్వైప్ అప్ చేయగానే కనిపించేలా తయారు చేశారు. వైఫై, బ్లూటూత్ మొదలైన ఫీచర్స్ ను ఒక్ టచ్ తోనే ఆన్ ఆఫ్ చేసుకునే సదుపాయం ఉంది. అలాగే స్టైలిష్ డిజైన్ లో బ్రైట్ నెస్ స్లైడర్, కస్టమైజేషన్ కు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. వైఫై, బ్యాటరీ, 5G సింబల్స్.. ఇలా అన్నింటి లుక్ మారినట్లు కంపెనీ చెబుతోంది. అంతే కాకుండా ఆండ్రాయిడ్ అప్ డేట్ వలన ఫోన్ మరింత స్మూత్ గా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని చెబుతున్నారు.