హైదారాబాద్ లోని బతుకమ్మ కుంట చెరువులా అభివృద్ధి చేస్తాం : వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హైదారాబాద్ లోని బతుకమ్మ కుంట చెరువులా అభివృద్ధి చేస్తాం : వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హసన్ పర్తి, వెలుగు : హైదారాబాద్ లోని బతుకమ్మ కుంట చెరువును అభివృద్ధి చేసినట్లే హనుమకొండ జిల్లా గోపాలపూర్ ఊర చెరువును అభివృద్ధి చేస్తామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య అన్నారు. గోపాలపూర్ ఊర చెరువు పూడికతీత పనులకు శుక్రవారం హనుమకొండ కలెక్టర్​ చాహత్ బాజ్​పాయ్, ఎంపీ కడియం కావ్యతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. 

అనంతరం హసన్​పర్తి మండల పరిధిలోని పెంబర్తి నుంచి అంబాల వరకు రూ.1.50 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కుడా చైర్మన్​ ఇనుగాల వెంకట్రామ్​రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.