గచ్చిబౌలి, వెలుగు: మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తికి రాజేంద్రనగర్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్డు 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించింది. బాధిత బాలికకు రూ.5 లక్షలు చెల్లించాలంది. గోపన్‌పల్లికి చెందిన సంతుల శివ(22) తన ఇంటి సమీపంలో ఓ బాలికను 2023లో కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి తీర్పునిచ్చారు.
