ఆ నిర్ణయం నిర్మాతకే  వదిలేయాలి

ఆ నిర్ణయం నిర్మాతకే  వదిలేయాలి

ఇప్పటి వరకు యాక్షన్ హీరోగా మెప్పించిన గోపీచంద్.. మొదటిసారి స్పోర్ట్స్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ‘సీటీమార్’ సినిమా చేశాడు. సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 10న థియేటర్స్‌‌‌‌లో రిలీజవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ ఇలా ముచ్చటించాడు.  

  • ‘గౌతమ్ నంద’ సినిమా తర్వాత సంపత్ నంది ఎడ్యుకేషన్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో  కథ చెప్పాడు. నాకది అంతగా నచ్చలేదు. మళ్లీ నెల రోజుల గ్యాప్‌‌‌‌లో ‘సీటీమార్’ స్టోరీ చెప్పాడు. స్పోర్ట్స్ బేస్డ్‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌ అనగానే ఇష్టపడ్డా. ఎందుకంటే ఇప్పటివరకు నేను స్పోర్ట్స్‌‌‌‌ డ్రామాలు చేయలేదు.  
  • హీరోకి ఒక గోల్ ఉంటుంది. దాన్నెలా రీచ్ అయ్యాడనేది కథ. సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. భూమిక నాకు అక్కగా నటించారు.  తమన్నా తెలంగాణ టీమ్ కోచ్‌‌‌‌గా నటించింది. తన పాత్ర కూడా స్ట్రాంగ్. 
  • ఫుల్‌‌‌‌ లెంగ్త్ కబడ్డీ సినిమాలంటే భీమిలి కబడ్డీ జట్టు, కబడ్డీ కబడ్డీ మాత్రమే. కంప్లీట్‌‌‌‌గా  అమ్మాయిల కబడ్డీ కాన్సెప్ట్‌‌‌‌ అయితే  అస్సలు  రాలేదు.  అందుకే  కొత్తగా అనిపించింది. నాకు ఆట రాకపోయినా బుక్ నాలెడ్జ్ ఉపయోగపడింది. 
  • మొత్తం పన్నెండు మంది ప్లేయర్స్ ఉంటే అందులో నలుగురు రియల్ నేషనల్ ప్లేయర్స్. షూటింగ్  మధ్యలో వారి స్ట్రగుల్స్ తెలుసుకుని చాలా బాధపడ్డాను. మహిళా ప్లేయర్స్​ని బయటి వ్యక్తులు ఎలా చూస్తున్నారనేది మనకి తెలుసు. ఆ పాయింట్​ను డిస్కస్​ చేశాం. ఏ ప్లేయర్​ అయినా డ్రెస్​ కోడ్​ ఫాలో కావాలే తప్ప, కావాలని చిన్న డ్రెస్సులు వేసుకోరు కదా. అంటే మనం చూసే చూపులోనే తప్పుంది.
  • పోయినేడు సమ్మర్‌‌‌‌‌‌‌‌లో రిలీజ్ చేద్దామంటే  లాక్ డౌన్ వచ్చింది. ఈ యేడు సమ్మర్‌‌‌‌‌‌‌‌లో చేద్దామనుకుంటే సెకెండ్ లాక్ డౌన్ వచ్చింది. ఇప్పటికి వస్తున్నాం. థియేటర్స్​లో రిలీజ్ చేయాలా, ఓటీటీకి వెళ్లాలా అనే నిర్ణయం నిర్మాతలకే వదిలేయాలి.  ఓటీటీ కూడా మంచి ప్లాట్‌‌‌‌ఫామే. కాకపోతే థియేటర్‌‌‌‌‌‌‌‌లో చూసినప్పుడు వచ్చే ఫీల్ వేరు. అందుకే థియేటర్స్‌‌లో రిలీజ్ చేయాలనే ప్రతి నిర్మాత అనుకుంటాడు. పరిస్థితులు అనుకూలించక కొందరు ఓటీటీకి వెళ్తున్నారు. అందులో తప్పేమీ లేదు. 
  • ప్రస్తుతం  ‘పక్కా కమర్షియల్’ మూవీ చేస్తున్నా. చివరి దశలో ఉంది. శ్రీవాస్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నాను. తేజతో సినిమా మెటీరియలైజ్ అవలేదు.