ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల మరియు మ్యాచో స్టార్ గోపిచంద్ కాంబినేషన్లో తెరకెక్కిన విశ్వం ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ ట్రైలర్ విశేషాలేంటో చూద్దాం.
మంచు కొండలలో టెర్రరిస్ట్ సన్నివేశాలతో త్వరలో ఇండియాలో దీపావళి జరగబోతోందంటూ చెప్పే డైలాగులతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఇక ప్రముఖ హీరో మరియు కమెడియన్ సునీల్ పొలిటీషన్ పాత్రలో కనిపించాడు.
యాక్షన్ ఫైట్స్, అలాగే ఎమోషనల్ డైలాగాలతో గోపిచంద్ ఎంట్రీ ఇచ్చి మొత్తం చిత్ర ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాడాని చెప్పవచ్చు. నరేష్, పవిత్ర, భరత్, పృథ్వీ, వెన్నెల కిషోర్ తదితరులు కామెడితో ఆకట్టుకున్నారు. విలన్ పాత్రలో నటించిన జీషు సెంగుప్త డీసెంట్ లుక్ లో కనిపిచాడు. కామెడీ మరియు యాక్షన్ అలాగే ఎమోషన్స్ తో కట్ చేసిన విశ్వం ట్రైలర్ ప్రేక్షకుకలను బాగానే ఆకట్టుకుంటోంది.
ఈ విషయం ఇలా ఉండగా విశ్వం చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11 న థియేటర్లో విడుదల కాబోతోంది. గత కొన్ని ఏళ్లుగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఈ ఇద్దరికీ విశ్వం చిత్రం హిట్ కొట్టడం చాలా ముఖ్యం. ట్రైలర్ తో ఆకట్టుకున్న గోపిచంద్ థియేటర్లో ఏ విధంగా అలరిస్తాడో చూడాలి.