బాలయ్య చెప్పిన టైటిల్‌‌తో.. గోపీచంద్ సినిమా

బాలయ్య చెప్పిన టైటిల్‌‌తో.. గోపీచంద్ సినిమా

లక్ష్యం, లౌక్యం సినిమాలతో గోపీచంద్‌‌కు కమర్షియల్ హీరోగా పేరొచ్చింది. ఆ రెండు చిత్రాల దర్శకుడు శ్రీవాస్‌‌తో మూడో సినిమా చేస్తున్నాడు గోపీచంద్. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌‌ను ‘రామబాణం’గా ప్రకటించారు . కొన్ని  రోజుల క్రితం ప్రభాస్, గోపీచంద్ కలిసి హాజరైన  ‘అన్ స్టాపబుల్’ షోలో బాలకృష్ణ  ఈ టైటిల్‌‌ను గోపీచంద్‌‌కు సజెస్ట్‌‌ చేశారు. గోపీచంద్‌‌ మూవీ టైటిల్స్‌‌ చివర్లో సున్నా వస్తుందనే  సెంటిమెంట్ ప్రకారం ‘రామబాణం’గా నిర్ణయించినట్టు చెప్పారు. 

ఫైనల్‌‌గా అదే పేరును టీమ్ ప్రకటించింది. ఇందులో గోపీచంద్‌‌కి జంటగా డింపుల్ హయతి నటిస్తోంది. జగపతి బాబు, ఖుష్బు, సచిన్ ఖేడ్కర్, కాశీ విశ్వనాథ్, సప్తగిరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.  గోపీచంద్ కెరీర్‌‌లో ఇది 30వ సినిమా. షూటింగ్ చివరి దశలో  ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్నారు.  మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.