రైల్వే అధికారి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. సీబీఐ దాడుల్లో దొరికేశాడు

రైల్వే అధికారి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. సీబీఐ దాడుల్లో దొరికేశాడు

అతనో రైల్వే ఉన్నతాధికారి.. జీతం బాగానే ఉన్నా.. సంపాదనపై మోజు చావలేదు.. ఉన్నతాధికారిగా కాంట్రాక్టర్ల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నాడు.. అధికారి ఆగడాలు భరించలేక ఓ కాంట్రాక్టరు సీబీఐని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. వలపన్ని రైల్వే అధికారిని పట్టుకున్నారు. అతని  ఇండ్లలో సోదాలు నిర్వహించగా.. అక్రమంగా సంపాదించిన నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. 

కాంట్రాక్టరు నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకున్నందుకు గోరఖ్పూర్లో నార్త్ ఈస్టర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ మెటీరియ్ మేనేజర్ కేసీ జోషిని సీబీఐ అధికారులు వలపన్ని అరెస్ట్ చేశారు. గోరఖ్పూర్, నోయిడాలోని జోషి ఇండ్లను సోదా చేసిన సీబీఐరూ. 2.61 కోట్ల నగదు, నేరారోపణ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. జీఈఎమ్ పోర్టల్ లో ఫిర్యాదుదారు సంస్థ రిజిస్ట్రేషన్ రద్దు చేయకుండా ఉండాలంటే రూ.7 లక్షలు డిమాండ్ చేసినట్లు జోషీపై ఆరోపణలు వచ్చాయి. 

Also Read :- లాకర్లలో 10 కేజీల బంగారం.. అంతా స్కాం చేసి దోచుకున్నదే

ఫిర్యదుదారు సంస్థ  నుంచి రూ. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ వలపన్ని జోషిని అరెస్ట్ చేసింది. నిందితుడిని లక్నోలోని కంపిటెంట్ కోర్టులో హాజరుపర్చారు.